కృతి శెట్టి.. ప్రస్తుతం తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోంది. ఈ యంగ్ బ్యూటీకి టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడికి మంచి డిమాండ్ ఉండడంతో.. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఉప్పెన తర్వాత.. నాని ‘శ్యామ్ సింగరాయ్’.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు సై అంటోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది.
అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సందీప్. ఆ సాంగ్‌లో యంగ్ బ్యూటీ కృతి శెట్టిని తీసుకోవాలని భావిస్తున్నాడట. అయితే ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’.. సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్ సరసన ‘ది వారియర్’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సూర్య-బాలా కాంబినేషన్లో వస్తున్న మూవీలో కూడా నటిస్తోంది. ఇవే కాదు.. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అలాగే బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి టైంలో ఐటెం ఆఫర్‌ను బేబమ్మ ఓకే చెబుతుందా.. అనే సందేహాలున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.