ప్రస్తుతం స్టార్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. అవకాశాలు వస్తున్నప్పుడే వ్యాపారాలు పెట్టుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. అవకాశాలు లేనప్పుడు వ్యాపారాలను చూసుకుంటూ హ్యాపీగా బతికేస్తున్నారు. హొట్లాస్, ఫుడ్ బిజినెస్ రంగంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ హస్తవాసిని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈ రెండు బిజినెస్ లు కాకుండా స్టార్లు ఫిట్ నెస్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ రకుల్ ఫిట్ నెస్ రంగంలో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా విశాఖపట్నంలో జిమ్ లు ఓపెన్ చేసి ఫిట్ నెస్ పెంచేస్తోంది. ఇక తాజాగా ఈ భామకు గట్టి పోటీ రాబోతుంది. వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్ కూడా ఫిట్ నెస్ రంగంలోకి దిగుతుంది. తాజగా ఆమె ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే.
తాజాగా ఈ బ్యూటీ రకుల్ తరహాలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది. కృతి `ది ట్రైబ్` అనే జిమ్ ను ఆమె ఓపెన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇది వర్చువల్ అండ్ ఇన్-స్టూడియో శిక్షణ. ట్రైనర్ మేడ్ న్యూట్రిషన్ .. కార్పొరేట్ వెల్ నెస్ ను అందించే వెల్ నెస్ స్టూడియో. “ది ట్రైబ్ శిక్షకుల ద్వారా మీకు మీరుగా అత్యుత్తమ.. ఉత్తమమైన వెర్షన్ గా మారడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తామని నమ్ముతున్నాము. ఇది ఇన్-స్టూడియో.. గ్రూప్ .. పర్సనల్ లేదా వర్చువల్ సెషన్ లతో కొంతమంది చక్కని చిన్న వయస్సు ఫిట్టెస్ట్ ట్రైనర్ లతో శిక్షణ కార్యక్రమమిది. కానీ వర్కౌట్ లను చాలా సరదాగా చేయండి!” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ భామ పోటీని రకుల్ తట్టుకుంటుందా..? లేక రకుల్ పోటీని తట్టుకోలేక ఏఈ భామే తప్పుకుంటుందా..? అనేది చూడాలి.