కృతి సనన్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెగ వినిపిస్తుంది.. ఇప్పటివరకు బాలీవుడ్ జనాలకు మాత్రమే పరిచయం అయిన ఈ అమ్మడు ఇప్పుడు సీతమ్మగా అభిమానుల ముందుకు రాబోతుంది.. ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆదిపురుష్ లో కృతి సీత పాత్రలో కనిపించంనుంది. ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రాముడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్నీ సినిమాకు హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.. మరో నాలుగు రోజుల్లో (జూన్ 16న) ఈ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం పై భారీగానే అంచనాలు ఉండగా.. ఎప్పుడెప్పుడు ఈ రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు యావత్ సినీ ప్రజలు.. అయితే ఆదిపురుష్ చిత్రయూనిట్ మాత్రం ప్రమోషన్స్, ఇంటర్వ్యూలకు దూరంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి సనన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు కథానాయికగా అలరించిన కృతి.. ఇప్పుడు నిర్మాతగా మారనుందట..
అవును.. మీరు విన్నది అక్షరాల నిజం.. ఓటీటీ సినిమాలకు మాత్రమే..ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న మూవీకు కృతి సనన్ నిర్మాతగా వ్యవహరిస్తుందని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్లు కావొస్తుంది.. బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా అయితే ఆమె ఖాతాలో పడలేదు.. ఇప్పుడు వస్తున్న ఆదిపురుష్ సినిమాపై ఆశలు పెట్టుకుంది.. మరి ఈ సినిమా అమ్మడుకు ఎంతవరకు క్యాష్ చేసుకునేలా చేస్తుందో చూడాలి..