Kriti Sanon – Kajol reuniting for Kanika Dhillon’s Kathha Pictures Do Patti: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలితో కృతి సనన్, కాజోల్ మూవీ చేస్తున్నారు. అవును నిజమే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రావు మాజీ భార్య, రచయిత్రి కనికా ధిల్లాన్ నిర్మాతగా మారి “దో పట్టి” అనే సినిమా చేస్తుండగా ఆ సినిమాలో కాజోల్, కృతి సనన్ నటిస్తున్నట్టు మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ గా దీన్ని సిద్ధం చేస్తున్నారు. కనికా ఈ మధ్యనే కొత్తగా ప్రారంభించిన కథా పిక్చర్స్ బ్యానర్‌లో ఇదే మొదటి సినిమా. “కేదార్‌నాథ్”, “మన్‌మర్జియాన్”, “హసీన్ దిల్‌రూబా”, జడ్జ్ మెంటల్ హై క్యా సినిమాలకి కనికా ధిల్లాన్ రచయితగా వ్యవహరించారు. తన ప్రొడక్షన్ హౌస్ “కథలు మరియు కథకులకు సాధికారత” ఇచ్చే వేదికగా మారుతుందని ఆశిస్తున్నట్లు కనికా ధిల్లాన్ చెబుతున్నారు.
Chiranjeevi: ‘భోళా శంకర్’ పూర్తి.. అమెరికా వెకేషన్‌కు మెగాస్టార్
నిర్మాతగా ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు థ్రిల్‌గా ఉన్నాను, ‘దో పట్టి’ ఆకట్టుకునే కథ, రచయితగా నా హృదయానికి చాలా దగ్గరైందని ఆమె చెబుతున్నారు. స్క్రీన్ రైటర్‌గా, ధిల్లాన్ ప్రస్తుతానికి షారూఖ్ ఖాన్ నటించిన రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన “డుంకీ”, “ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా” సినిమాలకి పని చేస్తున్నారు. ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌తో కృతి సనన్ కూడా నిర్మాతగా మారుతోంది. ఈ సినిమాను ప్రకటించడానికి ఒక రోజు ముందే అంటే నిన్ననే ఆమె తన ప్రొడక్షన్ హౌస్‌ను ప్రకటించింది. ఇప్పుడు, కృతి సనన్ దో పట్టి గురించి ఒక ఫొటో షేర్ చేస్తూ, “ నా ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్‌తో నిర్మాతగా నా అరంగేట్రం కావడంతో నా హృదయంలో చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న స్క్రిప్ట్ అని ఆమె రాసుకొచ్చింది. ఇక దిల్‌వాలే తరువాత కాజోల్ తో కృతి సనన్ దాదాపు 8 సంవత్సరాల అనంతరం కలిసి పని చేస్తోంది.
Super excited to announce my production house @KathhaPictures’ maiden film #DoPatti with these supremely talented queen bees! @itsKajolD @kritisanon @NetflixIndia pic.twitter.com/heFLhogbW1
— Kanika Dhillon (@KanikaDhillon) July 5, 2023