Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty: ‘ఉప్పెన’తో మొదలైన సునామీ.. ఆ వెంటనే ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’తో వరుసగా రూ.100 కోట్ల మార్క్ దాటిన గోల్డెన్ ట్రాక్ రికార్డు ఆమె సొంతం. టాలీవుడ్లో సరికొత్త లక్కీ చార్మ్‌గా ముద్రపడి, మలయాళంలో ‘ARM’తోనూ బ్లాక్‌బస్టర్ ఖాతా తెరిచిన కృతి శెట్టికి తమిళ గడ్డ మాత్రం అస్సలు కలిసిరావడం లేదు. తెలుగులో సూపర్ హిట్ చూసి ఏళ్లు గడుస్తుండటం ఒక ఎత్తయితే, కోలీవుడ్‌లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆమె పట్టిందల్లా బూడిదవుతోందన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకుని తమిళనాట చేసిన ప్రయోగాలు ఈ బ్యూటీకి ఊహించని దెబ్బ కొట్టాయి. స్టార్ హీరో కార్తీతో చేసిన ‘వాతియార్’ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేయగా, యూత్ ఫేవరెట్ ప్రదీప్ రంగనాథన్‌తో చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ కూడా డిజాస్టర్‌గా మిగిలింది. స్ట్రెయిట్ తమిళ సినిమా అయినా, బైలింగ్వల్ ప్రాజెక్ట్ అయినా అక్కడ కృతి మ్యాజిక్ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. దీంతో కోలీవుడ్‌లో ఆమె ఖాతాలో ఒక్క హిట్ కూడా లేని పరిస్థితి దాపురించింది.
తమిళంలో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో తిరిగి టాలీవుడ్‌పైనే దృష్టి సారించింది ఈ కన్నడ కస్తూరి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, కల్యాణ్‌రామ్ హీరోయిలుగా నటిస్తున్న చిత్రంలో ఈ బ్యూటీ కల్యాణ్‌రామ్ సరసన జనవరి 12న సంక్రాంతి బరిలో దిగుతోంది. ఇప్పటివరకు అపజయమన్నదే ఎరుగని దర్శకుడిగా పేరున్న అనిల్ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌తో బేబమ్మకు టాలీవుడ్లో సాలిడ్ కంబ్యాక్ దక్కడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కృతి కెరీర్‌ను కోలీవుడ్‌లో నిలబెట్టగల సత్తా ఉన్న ఏకైక హై-బడ్జెట్ చిత్రం ‘జీని’. జయం రవి హీరోగా, కల్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బితో కలిసి కృతి నటిస్తున్న ఈ పాన్-ఇండియా రేంజ్ ఫాంటసీ మూవీ షూటింగ్ మొదలై మూడేళ్లు దాటింది. ఇప్పటికే షూటింగ్ ముగిసిందని హీరో ప్రకటించడం, రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ వేల్స్ ఇంటర్నేషనల్ బీటీఎస్ (BTS) వీడియోను రిలీజ్ చేయడం వరకు బాగానే ఉన్నా.. అసలు సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో మాత్రం నిశ్శబ్దమే రాజ్యమేలుతోంది. ఓవైపు దర్శకుడు శంకర్ కుమారుడు అర్జిత్ శంకర్ సరసన ‘లవర్ బాయ్’ షూటింగ్‌ను రీసెంట్‌గానే పట్టాలెక్కించినప్పటికీ, మూడేళ్లుగా ల్యాబ్‌లకే పరిమితమైన ‘జీని’ విడుదల కాకపోతే కృతికి తమిళనాట బ్రేక్ దక్కడం కష్టమే అని టాక్ ఉంది. సంక్రాంతికి తెలుగులో పూర్వవైభవం సాధించినా.. కోలీవుడ్ ఫ్లాప్ లెక్కలు సరిచేసి అక్కడ తన సత్తా చాటుకునే సమయం కృతికి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!