Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రానికి ‘ఏకే 47’ అనే గన్ పేరును టైటిల్‌గా జోడించడం ద్వారా.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ టీజర్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే సరదా సంఘటనలతో మొదలైన ఈ గ్లింప్స్.. వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పదునైన పంచ్ డైలాగ్స్, ఊహించని ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. వెంకటేష్ తనదైన శైలిలో నవ్విస్తూనే యాక్షన్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేశారు. పైకి ఆదర్శ కుటుంబంగా కనిపిస్తూనే, ఆ ఫ్యామిలీ దాచిన అసలు కథ ఏంటనే ఉత్సుకతను టీజర్ అద్భుతంగా రేకెత్తించింది. వెంకటేష్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు లాంటి భారీ కాస్టింగ్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. థమన్ ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. రవి కె. చంద్రన్ విజువల్స్, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమా స్థాయిని చాటిచెబుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా భుజాన వేసుకుని చెక్కిన ఈ అచ్చమైన తెలుగు సినిమా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. వినోదానికి యాక్షన్ జోడించి బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లే రేంజ్ హిట్టు కొట్టేందుకు వెంకీ-త్రివిక్రమ్ సిద్ధమయ్యారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!