Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా హీరోల అభిమాన సంఘాలు అంటే కటౌట్లు కట్టడం, థియేటర్ల వద్ద హంగామా చేయడం, రికార్డుల కోసం సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం వరకే పరిమితం అవుతాయనే ఒక అపవాదు ఉంది. కానీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మాత్రం ఆ గీతను చెరిపేస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఏకంగా 3 లక్షల మంది బాలికలకు రక్షణ కవచంగా నిలిచే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రియల్ హీరోలమనిపించుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానులు భాగస్వాములయ్యారు. మహిళల పాలిట సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నివారణ, హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ ఆవశ్యకతపై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిస్సా, అలాగే అండమాన్ నికోబార్ దీవుల వరకు మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ అవగాహన ప్రచారాన్ని హోరెత్తించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి దిగి ఏకంగా 820 స్కూల్స్, వివిధ కమ్యూనిటీల్లో విద్యార్థినులను కలుసుకున్నారు. ఈ మెగా డ్రైవ్ ద్వారా సుమారు 3 లక్షల మంది యువతులకు, బాలికలకు చేరువయ్యారు. భవిష్యత్తులో క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంత కీలకమో వివరిస్తూ సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే పండగ చేసుకునే ఫ్యాన్స్.. ఇప్పుడు ఏకంగా ఒక సామాజిక లక్ష్యం కోసం దేశవ్యాప్తంగా ఏకతాటిపైకి రావడం సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. సమాజం బాగు కోసం ముందడుగు వేస్తూ, బాలికలకు అండగా నిలబడిన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న ఈ కృషి ఇప్పుడు ఇతర అభిమాన సంఘాలకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!