Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలను చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం కానీ వాటి వెనుక అసలు కారణాలు చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో మన మొబైల్ ఫోన్ నంబర్లకు ముందు ఉండే ‘+91’ కోడ్ కూడా ఒకటి. ప్రతిరోజూ మనం ఎంతోమందికి కాల్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు ఈ నంబర్ ఆటోమేటిక్‌గా టైప్ అవుతుంటుంది. అసలు ఈ సంఖ్య ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న చారిత్రక, అంతర్జాతీయ నిబంధనలు ఏమిటి? అని ఎప్పుడైనా ఆలోచించామా? చాలామందికి దీని గురించి సరైన అవగాహన ఉండదు. కేవలం ఇదొక కోడ్ అని మాత్రమే భావిస్తుంటాం. కానీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైంటిఫిక్, గ్లోబల్ టెలికాం వ్యవస్థ దాగి ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్రపంచవ్యాప్తంగా టెలిఫోన్ నెట్‌వర్క్‌లను నిర్వహించడానికి , అంతర్జాతీయ కాల్స్‌ను సులభతరం చేయడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్’ (ITU) కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రపంచ దేశాలన్నింటికీ ప్రత్యేకమైన దేశీయ కోడ్స్ కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే భారతదేశానికి 91 అనే కోడ్ కేటాయించబడింది.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ప్రపంచ టెలికాం జోన్లు..
ITU ప్రపంచాన్ని మొత్తం 9 ప్రధాన భౌగోళిక జోన్లుగా విభజించింది. ఇందులో దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్య ప్రాంతాలు అన్నీ కూడా ‘జోన్ 9’ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్‌లోని దేశాలన్నింటికీ సాధారణంగా ‘9’ తో ప్రారంభమయ్యే కోడ్స్ కేటాయించారు. అందువల్ల జోన్ 9 లో ఉన్న భారతదేశానికి ‘9’ తో పాటు మరో ప్రత్యేక అంకెను జోడించి 91 గా కేటాయించడం జరిగింది. అంతే కాకుండా.. మన పక్కనే ఉన్న శ్రీలంక కోడ్ +94, పాకిస్థాన్ కోడ్ +92, ఆఫ్ఘనిస్థాన్ కోడ్ +93 గా ఇలా కేటాయించారు.
చిన్న కోడ్ కేటాయింపు వెనుక కారణం..
1960వ దశకంలో ఈ కోడ్లను కేటాయించే సమయంలో జనాభా, ఆర్థిక ప్రాముఖ్యత, అంతర్జాతీయ కాల్స్ రాకపోకలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన దేశాలలో భారత్ ఒకటి కావడంతో, అంతర్జాతీయంగా సులభంగా డయల్ చేయడానికి వీలుగా తక్కువ అంకెలు గల కోడ్‌ను కేటాయించారు.
‘+’ (ప్లస్) ప్రాముఖ్యత ఇది..
నంబర్ ముందు ఉండే ‘ప్లస్’ (+) సింబల్ అనేది ఇంటర్నేషనల్ డైరెక్టింగ్ ప్రిఫిక్స్ను సూచిస్తుంది. మనం దేశం వెలుపల నుంచి అంటే ఇంటర్నేషన్ కాల్ చేస్తున్నప్పుడు ఇది గ్లోబల్ నెట్‌వర్క్‌కు సంకేతంగా పనిచేస్తుంది. ఇది భారతదేశంలోని సరైన టెలికాం నెట్‌వర్క్‌కు కాల్‌ను అనుసంధానించడానికి దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే.. +91 అనేది కొన్ని అంకెలు మాత్రమే కాకుండా, ప్రపంచ టెలికాం పటంలో భారతదేశ గుర్తింపును, అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో మన దేశ స్థానాన్ని తెలిపే ఒక విశిష్ట సంకేతం.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు