Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుహాస్ చేసిన వ్యాఖ్యలు అటు ఎమోషనల్‌గా కదిలిస్తూనే, ఇటు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముఖ్యంగా లెజెండరీ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్‌కు సంబంధించి సుహాస్ రివీల్ చేసిన ఒక ఫన్నీ సీక్రెట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనంగా మారింది. వేదికపై మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైన సుహాస్, ఆ ఎమోషన్ నుంచి బయటపడేందుకు షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నాడు. సముద్రంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తూ నీళ్లలో పడిపోతే వెంటనే కాపాడేందుకు లోకల్ బోట్ ప్లేయర్స్ ఎప్పుడూ అలర్ట్‌గా ఉండేవారట. ఒకరోజు పీటర్ హెయిన్ మాస్టర్ బోట్ మీద నుంచి సముద్రం నీళ్లలోకి దిగారు. ఆయన ప్రమాదవశాత్తూ పడిపోయారేమో అనుకుని ఆ కుర్రాళ్లంతా ఆయన్ని కాపాడేందుకు నీళ్లలోకి దూకేశారు. వాళ్ల కంగారు చూసిన పీటర్ హెయిన్.. “రేయ్.. నేను టాయిలెట్ కి దిగానురా! నేను 34 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ మాస్టర్ని.. నాకే సేఫ్టీ చూస్తున్నారా? వెళ్లిపోండిరా బాబు” అంటూ వారిని పైకి పంపారట. సుహాస్ ఈ విషయాన్ని చెప్పగానే ఈవెంట్లో ఉన్నవారంతా పగలబడి నవ్వారు.
ఈ సక్సెస్ మీట్లో సుహాస్ మాట్లాడుతూ సూరి పడ్డ కష్టాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టుకున్నాడు. దేవుడు వాళ్ల కష్టాన్ని చూసి ఈరోజు ఇంత పెద్ద హిట్ ఇచ్చాడని అన్నాడు. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఒకానొక దశలో సూరి కాలు సడెన్‌గా కిందకు వంగిపోయి ‘V’ షేప్‌లోకి వచ్చేసిందని, అయినా సరే పీటర్ హెయిన్ మాస్టర్ వదల్లేదని సుహాస్ గుర్తుచేసుకున్నాడు. సూరికి కంగ్రాట్స్ చెబుతూ, సాయంత్రం తన ఇంట్లోనే గ్రాండ్ పార్టీ ఉంటుందని ప్రకటించాడు. ఈ విజయం గురించి మాట్లాడుతూ “ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఏడ్చేస్తాను” అంటూ సుహాస్ ఎమోషనల్ అయ్యాడు. సినిమా విడుదలకు ముందే మైత్రీ నవీన్, రవి ఈ చిత్రాన్ని చూసి ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెప్పారని, దాంతో రిలీజ్ టెన్షన్ అక్కడే సగం తగ్గిపోయిందని సుహాస్ వెల్లడించాడు. సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ఆడియన్స్‌కు, తనను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎల్రెడ్ కుమార్‌కు సుహాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. సినిమా రిలీజ్ తర్వాత జర్నలిస్ట్ శివన్న నుంచి తనకు ఫస్ట్ కాల్ వచ్చిందని, ‘మనవాడు అక్కడికి వెళ్లి కొట్టాడు’ అని అందరూ ఓన్ చేసుకుని మాట్లాడుతుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందని సుహాస్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. హీరోయిన్ మహిమ, నటుడు రవీంద్ర విజయ్ పెర్ఫార్మెన్స్ను సైతం సుహాస్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!