Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కి సరిహద్దులు లేవని, ఇక్కడి ప్రేక్షకులు ప్రతిభను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి నిరూపితం కాబోతోంది. సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న ‘కొత్త మలుపు’తో ఒక అస్సాం భామ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. తాటి బాలకృష్ణ నిర్మాణంలో, శివ వరప్రసాద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ వినూత్న ప్రేమకథా చిత్రం జూన్ 12న (రేపే) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. అస్సాం నుంచి వచ్చి అచ్చ తెలుగమ్మాయిలా మారిపోయిన తన సినీ ప్రయాణం మరియు ‘కొత్త మలుపు’ అనుభవాలను పంచుకున్నారు.
చిన్నప్పటి నుంచే వెండితెరపై మెరవాలనే బలమైన కోరిక భైరవిని టాలీవుడ్ వైపు నడిపించింది. స్కూల్ డేస్ నుంచే తెలుగు సినిమాలకు పెద్ద ఫ్యాన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం ఇక్కడి సినిమాల్లో నటించాలనే లక్ష్యంతోనే హైదరాబాద్ అడుగుపెట్టిందట. “నేను అస్సాం నుంచి వచ్చినప్పుడు నాకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. కానీ ఇక్కడి కథలు, ఎమోషన్స్ నాకు చాలా ఇష్టం. అందుకే వెనక్కి తగ్గకుండా దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు నిరంతరం ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. చుట్టుపక్కల వాళ్లతో బలవంతంగా తెలుగులోనే మాట్లాడుతూ భాషపై పట్టు సాధించాను. అంతేకాదు, హైదరాబాద్‌లోని ‘నటరంగ్ థియేటర్’లో ఆరు నెలల పాటు ప్రత్యేకంగా యాక్టింగ్ కోర్సు కూడా తీసుకున్నాను.” అని చెప్పుకొచ్చింది.
Also Read
‘కొత్త మలుపు’ సినిమాలో భైరవి ‘వరలక్ష్మి’ అనే పల్లెటూరి అమాయకపు అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. అస్సాం జీవనశైలికి, గోదావరి లైఫ్‌స్టైల్‌కు అస్సలు సంబంధం లేకపోయినా.. షూటింగ్‌కు నెల రోజుల ముందే కోనసీమ వెళ్ళిపోయి అక్కడి స్థానిక మహిళల బాడీ లాంగ్వేజ్, బట్టలు కట్టుకునే విధానం, ముఖ్యంగా గోదావరి యాసను నిశితంగా గమనించి నేర్చుకుందట. అందుకే ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా ఈమె అస్సాం అమ్మాయి అంటే నమ్మట్లేదని, అచ్చమైన గోదావరి పిల్లలా ఉందంటూ కితాబు ఇస్తున్నారని భైరవి ఆనందం వ్యక్తం చేసింది. ఇక కోనసీమ వాతావరణం, అక్కడి కొబ్బరి తోటల అందాలు తనను మంత్రముగ్ధులను చేశాయని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!