Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి, ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. రెండు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తే.. ఒకటి హిట్టు, మరొకటి ఫట్టు అయ్యాయి. స్పెషల్ సాంగ్ లో మెరిసిన ‘కూలీ’ ఫ్లాప్ కాగా, ‘F3’ ఓకే అనిపించుకుంది.
పూజా హెగ్డే సక్సెస్ ప్రయాణం ‘అరవింద సమేత వీరరాఘవ’తో మొదలైంది. ఆ తర్వాత నటించిన మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ ఫుల్ 4, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ చూపింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’తో మొదలైన ఫెయిల్యూర్ సిరీస్.. ఐదేళ్లు గడిచినా ఆగడం లేదు. విజయ్ తో ‘బీస్ట్’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ తో జతకట్టిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, షాహిద్ కపూర్‌తో నటించిన ‘దేవా’, సూర్యతో చేసిన ‘రెట్రో’.. లేటెస్ట్ గా వరుణ్ ధావన్‌తో చేసిన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ కూడా నిరాశనే మిగిల్చాయి. ఫ్లాప్‌లను అడ్డుకునే సినిమా ఒక్కటి కూడా పడలేదు.
Also Read
దీంతో ఐరన్ లెగ్ ముద్ర పడడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజాను దూరంగా పెట్టింది. మొదట ఇచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి లాగేసుకుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ముందుగా పూజాను సెలెక్ట్ చేసి, చివరకు శ్రీలీలను తీసుకున్నారు. ‘గుంటూరు కారం’లో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసిన తర్వాత ఆమెను తప్పించారు. ఎట్టకేలకు దుల్కర్ సల్మాన్ తో జతకట్టి, ఒక తెలుగు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేయడంతో తమిళ, హిందీ సినిమాలతో పూజ కాలక్షేపం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘కాంచన 4’లో నటిస్తోంది. అలాగే ‘జననాయగన్’ రిలీజ్ కు రెడీగా ఉంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ సక్సెస్ తీసుకొస్తుందని పూజ ఆశగా ఎదురుచూసింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేసినా బాక్సాఫీస్ వద్ద సౌండ్ వినిపించడం లేదు, కలెక్షన్స్ సోసోగానే ఉన్నాయి. ఐదేళ్లుగా ఎనిమిది ఫ్లాప్‌లు ఇచ్చినప్పటికీ పూజకు ఆఫర్స్ తగ్గలేదు కానీ, ఎప్పుడూ ఏదో ఒక హిందీ మూవీతో బిజీగా ఉండే పూజ చేతిలో ఈసారి ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లేదు. ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’లో గ్లామర్ గా, కలర్ ఫుల్ గా కనిపించినప్పటికీ ఐరన్ లెగ్ ముద్రకు దూరం కాలేకపోయింది. వరుణ్ ధావన్ సినిమా కూడా హ్యాండ్ ఇవ్వడంతో, ఇప్పుడు తమిళ స్టార్ విజయ్‌నే నమ్ముకుంది పూజ. విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ త్వరలో థియేటర్స్ లోకి రానుంది. తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ రీమేక్ గా ఈ ‘జననాయగన్’ రూపొందింది. తెలుగులో కాజల్ పోషించిన రోల్ ను తమిళంలో పూజా హెగ్డే పోషించింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Air India: పాక్ ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియాకు నష్టం..
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!