Kota Srinivas : దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపారు. స్క్రీన్ మీద ఏ పాత్రలో అయినా ఒదిగిపోతారు. తన కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన కోట జీవితంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎంత పేరు సంపాదించుకున్నాడో.. అంతకు మించి కష్టాలను అనుభవించారు. డబ్బు పరంగా ఏ లోటు లేకపోయినా.. చనిపోయేదాకా ఎన్నో బాధలు అనుభించారు కోట శ్రీనివాసరావు. 1973లో ఆయన భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. షాక్ కు గురైన రుక్మిణి.. మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణీ. ఈ విషయాలను కోట బయటకు చెప్పలేదు.
Read Also : Kota Srinivas : కోట శ్రీనివాస్ నుంచి నటన నేర్చుకున్నా.. జెనీలియా ఎమోషనల్..
కానీ తన బంధువుల దగ్గర చెప్పుకుని ఎన్నోసార్లు బాధపడ్డారు కోట శ్రీనివాస్. ఆ బాధను దిగమింగుకుని వందలాది సినిమాల్లో నటిస్తున్న టైమ్ లో మళ్లీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన కూతురు ఓ ప్రమాదంలో కాలు కోల్పోయింది. అది కోట శ్రీనివాస్ ను బాగా కుంగదీసింది. చాలా రోజులు ఆమె కోసం బాధపడ్డ కోట.. చివరకు ఎలాగోలా పెళ్లి చేశారు. కానీ ఆ సంతోషం కొన్ని రోజులే ఉంది. ఎందుకంటే 2010లో కోట శ్రీనివాస్ ఒక్కగానొక్క కొడుకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. దాంతో కోట శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఎన్నో సమస్యలను తట్టుకున్న కోట.. కొడుకు లేడనే బాధతో అనారోగ్యపాలయ్యారు.
తన కొడుకును తలచుకుంటూ నిత్యం బాధపడేవారు. మధ్యలో కొన్ని రోజులు సినిమాలు మానేశారు. స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చినా.. తన కొడుకు లేరనే బాధను చెప్పుకుంటూ నిత్యం బాధపడ్డారు కోట. నేను ఎంత సంపాదిస్తే ఏం లాభం.. నా కొడుకే వెళ్లిపోయాడు అంటూ ఎన్నోసార్లు కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక జీవిత చరమాంకంలో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. షుగర్ ఎక్కువ కావడంతో కాలు వేళ్లను తీసేశారు డాక్టర్లు. వృద్ధాప్య సమస్యలతో ఆయన నల్లబడ్డారు. చాలా రోజులు ఇంట్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకున్నారు. చివరకు కన్నుమూశారు. కెరీర్ పరంగా తిరుగులేని స్థాయికి ఎదిగిన కోట.. జీవితంలో మాత్రం చెప్పుకోలేని బాధలు అనుభవించారు.
Read Also : SSMB 29 : మహేశ్ మూవీ కోసం అంతా కొత్తవాళ్లే.. జక్కన్న ప్లాన్ ఏంటి..?