Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది. ఎందుకంటే ఆయన నటనలో సుప్రీమ్. ఆ టైమ్ లో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. యాక్టింగ్ పరంగా చాలా విషయాలు నేర్పించారు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీకి మళ్లీ దొరకడు అంటూ ఎమోషనల్ అయింది.
Read Also : SSMB 29 : మహేశ్ మూవీ కోసం అంతా కొత్తవాళ్లే.. జక్కన్న ప్లాన్ ఏంటి..?
నేను ఒకేసారి 500 సినిమాలు చేయాలని అనుకోవట్లేదు. నాకు నచ్చిన సినిమాలు చేస్తూ వెళ్లాలన్నదే నా ఉద్దేశం. అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతో మంది అడిగారు. కానీ అప్పుడు నాకు కుదరలేదు. ఇప్పుడు జూనియర్ తో రావడం సంతోషంగా ఉంది. అప్పట్లో బొమ్మరిల్లు, బాయ్స్, సై సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. చాలా పెద్ద డైరెక్టర్లతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. తెలుగులో నన్ను ఇప్పటికీ ఎంతో అభిమానిస్తున్నారు. త్వరలోనే తెలుగు సినిమాల్లో మంచిపాత్రలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నాను. సమంత చేసిన మజిలీ మూవీని నేను రీమేక్ చేశా. తెలుగులో సమంత అద్భుతంగా నటించింది. మరాఠీలో మా సొంత బ్యానర్ మీద దాన్ని రీమేక్ చేశాం. అక్కడ మంచి ఆదరణ వచ్చింది అంటూ చాలా విషయాలు తెలిపింది జెనీలియా.
Read Also : Lokesh Kanagaraj : ‘కూలీ’ కోసం లోకేష్ భారీ రెమ్యునరేషన్..