Konidela Chiranjeevi reference is used in almost all the sankranthi films: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా 12వ తేదీన హనుమాన్ సినిమాతో పాటు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది. తర్వాత 13వ తేదీన వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత 14వ తేదీన నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ అనే సినిమా రిలీజ్ అయింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గత ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవి కానీ నందమూరి బాలకృష్ణ కానీ ఈ సారి సంక్రాంతి బరిలో నిలవలేదు. అయినా సరే మెగాస్టార్ చిరంజీవి పేరు సంక్రాంతి సినిమాల్లో మారుమోగిపోయింది. ముఖ్యంగా దాదాపుగా మూడు సినిమాలలో ఆయన రిఫరెన్సులు కనిపించాయి. ముందుగా హనుమాన్ సినిమా విషయానికి వస్తే ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన వచ్చి టీమ్ కి ఇచ్చిన సపోర్ట్ ఎవరూ మర్చిపోలేరు.
Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్
అలాగే సినిమాలో కూడా మెగాస్టార్ కి సంబంధించిన ఎన్నో రిఫరెన్స్ లు కనిపించాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కళ్ళుగా చెబుతున్న కళ్ళు మెగాస్టార్ చిరంజీవి కళ్ళని పోలి ఉండటం గమనార్హం. నిజానికి గ్రాఫిక్స్ లో హనుమంతుని రూపాన్ని పూర్తిస్థాయిలో చూపించలేదు కానీ చిరంజీవి హనుమంతుడు అని దాదాపు అందరూ ఫిక్స్ అయిపోయే విధంగా రామనామ స్మరణ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు చేత తాను స్వయంకృషి సినిమాలో చిరంజీవి లాంటి వాడినని కింది స్థాయి నుంచి పైకి వచ్చాను అంటూ ఒక డైలాగ్ చెప్పించారు. ఇక నాగార్జున నా సామిరంగ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇద్దరూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మంచి దొంగ అనే సినిమా థియేటర్లో ఆడుతుండగా ఆ సినిమా చూసేందుకు వెళ్తారు. అలా మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో లేకపోయినప్పటికీ ఆయన పేరు మూడు సినిమాలతో మారుమోగిపోవడం గమనార్హం.