పురం సినిమా, అభిమాన థియేటర్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ‘కొంచెం హట్కే’ సినిమా ఫస్ట్ లుక్ బుధవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కుమార్ మాట్లాడుతూ ‘సినిమా నేపథ్యంలో ప్రధాన పాత్రల వ్యక్తిగత జీవితాలు వారి సినీ జీవితాల వల్ల ఎలా ప్రభావితం అయ్యాయి. సినీ జీవితం వల్ల వ్యక్తిగత జీవితాలు ఎలా తారుమారు అయ్యాయి అనే అంశాన్ని కొత్త తరహాలో చూపించటం జరిగింది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది’ అన్నారు. సహ నిర్మాత వాసు మాట్లాడుతూ ‘టాలెంటెడ్ టీమ్ తో తీసిన ఈ సినిమాకు నిర్మాత కావటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.
ఈ ఫస్ట్ లుక్ విడుదలకు వచ్చిన అతిథులతో పాటు మీడియా వారికి మొక్కలను అందచేసి ప్రాణవాయువు అవసరాన్ని తెలియచేసింది యూనిట్. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య, గురుచరణ్, కృష్ణమంజుష, కృష్ణ, షరీఫ్, ముఖ్య పాత్రధారులు. దీనికి కృష్ణ రావూరి మాటలు రాయగా అనిల్ మల్లెల సినిమాటోగ్రఫీని అందించారు. ఆగస్ట్ చివరి వారంలో సినిమాను రిలీజ్ చేస్తామని ‘హట్కే’ బృందం తెలిపింది.