తమిళ చిత్ర పరిశ్రమలో మరోక సంచలనానికి సర్వం సిద్ధం అవుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను తెరెకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్‌స్టార్స్ అయిన రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ కథ రెడీ ఇద్దరి సూపర్ స్టార్స్ కు వినిపించగా అందుకు వారిరిరువురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మిడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read : Nani : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకగా ‘ది పారడైస్’ బిగ్ సర్ప్రైజ్
ఇందుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో ప్రొమో ద్వారా అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకోసం రజనీ – కమల్ తో రెండు రోజులు షూట్ ప్లాన్ చేసాడు నెల్సన్. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు 20 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి ప్రసిద్ధ సినీ ఫోటోగ్రాఫర్ రాజీవ్ మెనన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వర్క్ చేయనున్నారు. రజనీ ప్రస్తతం నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2 లో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఫినిష్ అవగానే రజనీ -కమల్ సినిమా కు సంబంధించి పనులు స్టార్ట్ చేయబోతున్నాడు నెల్సన్. రాజ్ కమల్ ఫిల్మ్స్ రజిని – కమల్ సినిమాని నిర్మించే అవకాశం ఉంది.