చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్‌టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు కేక అనిపించింది ఇవానా.
తమిళంలో కెరీర్ పరంగా మిక్స్ డ్ రిజల్ట్ చూసిన బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఖరారైనా ప్రాజెక్ట్ హోల్డ్ కావడంతో కాస్త ఆలస్యమైంది. దిల్ రాజు బ్యానర్‌లో ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ హీరోగా సెల్ఫిష్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే ఇవానా టాలీవుడ్ తెరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ ఈసినిమాకు సుకుమార్ రైటింగ్ ఇవ్వాల్సి ఉండగా పుష్ప 2 షూటింగ్ వల్ల సెల్ఫిష్ వాయిదా పడిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దిల్ రాజు. అదే టైంలో గీతా ఆర్ట్ బ్యానర్ నుండి ఆఫర్ అందుకుంది అమ్మడు. టాలీవుడ్ యంగ్ అండ్ డైమనిక్ బాయ్ శ్రీ విష్ణు సరసన జోడీ కడుతోంది ఇవానా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను నిను వీడని నీడను నేను ఫేం కార్తీక్ రాజు దర్శకుడు. రీసెంట్లీ సింగిల్ గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మే నెలలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు. మరి టాలీవుడ్ ఆడియెన్స్ ను ఇవానా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.