Anushka Sharma: నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఇండియా, పాకిస్థాన్ పై విజయాన్ని అందుకొంది. పండగ వేళ భారతదేశానికి మొత్తం ఇంకా సంతోషాన్ని నింపింది టీమిండియా. ఇక ఈ విజయాన్ని భారతీయులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం విరాట్ సాధించిన విజయానికి శుబాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా విరాట్ భార్య అనుష్క శర్మ భర్త విజయాన్ని చూసి ఎమోషనల్ అయ్యింది.
భర్త విజయం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “మీరు ఈ రాత్రి ప్రజల జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు. అది కూడా దీపావళి సందర్భంగా!
మీరు ఎంతో అద్భుతమైన వ్యక్తి. మీ పట్టుదల, సంకల్పం మరియు నమ్మకం మనస్సును కదిలించేవి.. నేను చెప్పగలిగిన నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ని ఇప్పుడే చూశాను. మా అమ్మాయి తన తల్లి గదిలో ఎందుకు డ్యాన్స్ చేస్తుందో మరియు గదిలో విపరీతంగా అరుస్తోందో అర్థం చేసుకోలేనంత చిన్నది అయినప్పటికీ, ఆ రాత్రి తన తండ్రి తన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఆమె అర్థం చేసుకుంటుంది.అత్యంత కఠిన పరిస్థితుల నుంచి ఎన్నడు లేనంతగా పుంజుకున్నారు మీరు. మునుపెన్నడూ లేనంత బలంగా మరియు తెలివిగా బయటపడ్డాడు..మీ గురించి చాలా గర్వంగా ఉంది. మీపై నాకు అపారమైన ప్రేమ ఉంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.