యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలియజేశారు.
Read Also : గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్!
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో హీరో తండ్రిగా సాయికుమార్ నటించగా, తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల కావడమే ఆలస్యం. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఆయనకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. 33 సెకన్ల నిడివితో కట్ చేసిన ఆ టీజర్లో కిరణ్ పాత్రకు సంబంధించిన అన్ని ఎమోషన్స్ ను చూపించారు. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.