గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ రిపీట్!

మాచో స్టార్ గోపీచంద్ 30వ చిత్రంపై ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇది వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. వీరిద్దరూ గతంలో రెండుసార్లు కలిసి పని చేశారు. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీవాస్ స్క్రిప్ట్‌ ను పూర్తి చేసే పనిలో పడ్డారట.

Read Also : “రాపో19″లో నదియా ఫస్ట్ లుక్… ఎలా ఉందంటే?

మరోవైపు గోపీచంద్ చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా విజయం సాధించిందా ? లేదా ? అనే విషయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “సీటిమార్” చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న “పక్కా” కమర్షియల్ అనే చిత్రంలో గోపీచంద్ హీరోగా నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-