Kiraak RP: జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్ళు కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్ గా చేస్తూ.. ఇంకోపక్క సినిమాల్లో కూడా కనిపించి నవ్వించాడు. ఇక గత ఏడాది నుంచి కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ ను వదిలి.. హోటల్ బిజినెస్ లోకి దిగాడు. నెల్లూరు చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ పెట్టి.. ఒరిజినల్ చేపల పులుసును హైదరాబాదీలకు అందిస్తున్నాడు. ఇక షాప్ పెట్టిన కొద్దిరోజులకే కస్టమర్లతో ఆ కర్రీ పాయింట్ నిండిపోయింది. ఎంతలా అంటే.. తాకిడి తట్టుకోలేక ఆర్పీ.. వాళ్ళను అడ్డుకోవడానికి బౌన్సర్లను కూడా పెట్టాడు. ఇక అలా సాగిన ఈ కర్రీ పాయింట్ ను ఆర్పీ కొన్నిరోజులకే మూసేశాడు. అయితే దానికి కారణం ఆర్పీ ఒకలా చెప్తే.. బయట మరోలా చెప్పుకొస్తున్నారు. నా కర్రీ పాయింట్ కు వచ్చేవాళ్ళు ఎక్కువ కావడంతో.. వారిని తట్టుకోలేక .. మరో పెద్ద కర్రీ పాయింట్ ను పెట్టడానికి మధ్యలోనే ఆపేశానని ఆర్పీ చెప్తుండగా.. ఆర్పీ ఎవరో రాజకీయ నేతతో గొడవపడటం వలన.. అతనే అక్కడనుంచి ఖాళీ చేయించినట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పుడు మరోచోట తన బిజినెస్ ను రన్ చేస్తున్న ఆర్పీ.. తాజాగా మియాపూర్ క్రాస్ రోడ్స్ లో కొత్త బ్రాఞ్చ ను ఓపెన్ చేశాడు. బలగం వేణు ఈ కర్రీ పాయింట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాడు.
Rangabali: పవన్ కళ్యాణ్ ను.. ఓ రేంజ్ లో దింపేశారయ్యా.. సూపర్.. సూపర్ .. సూపర్
ఇక ఈ నేపథ్యంలోనే కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ” నా బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలు అయిన.. చిరంజీవి, ప్రభాస్,ఉపాసన, శ్రీకాంత్ లాంటి వారందరు టేస్ట్ చేసి బావుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా నా చేపల పులుసు చేరింది. మాదాపూర్ బ్రాంచ్ కు కొంతమంది బాలకృష్ణ మనుషులు వచ్చి చేపల పులుసును తీసుకెళ్లారు. ఒకసారి నచ్చడంతో.. రోజూ నా కార్ పాయింట్ కు రావడం మొదలుపెట్టారు. మొదట వాళ్ళు బాలకృష్ణ మనుషులు అని తెలియదు. ఆ తరువాత తెలియడంతో నేను చాలా సంతోషించాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.