విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా జులై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అనుడుకుంటాడని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిని మరోసారి నిరాశపరిచాడు దేవరకొండ.
భారీ అంచనాలు, భారీ ఎత్తున రిలీజ్ అయిన కింగ్డమ్ మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఫైనల్ రన్ ముగిసే నాటికి ప్లాప్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల బయ్యర్స్ కు నష్టాలు తెచ్చిపెట్టింది కింగ్డమ్. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ నెల 27న వినాయకచవితి కానుకగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తుంది కింగ్డమ్. థియేటర్స్ లో 28 రోజుల రన్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తో పాటు హిందిలోను రిలీజ్ అవుతోంది కింగ్డమ్. థియేటర్స్ లో ప్లాప్ అయిన కింగ్డమ్ మరి ఓటీటీలో ఏ మేరకు వ్యూస్ రాబట్టుకుంటుందో చూడాలి. అన్నట్టు థియేటర్స్ లో రిలీజ్ చేసిన సెన్సార్ వర్షన్ కాకుండా ఒరిజినల్ ఎక్స్టెండెడ్ వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు వస్తోంది. హిందీ వర్షన్ ను సామ్రాజ్య పేరుతోనే స్ట్రీమింగ్ చేస్తోంది నెట్ ఫ్లిక్స్.