Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ హవా మొదలైంది. జులై 31న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే లక్ష టికెట్లు సేల్ అయిపోయాయి. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ కు ఇంకో రెండు రోజులు ఉండగానే టికెట్లు భారీగా అమ్ముడు పోతున్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్ లో కూడా బాగానే టికెట్లు అమ్ముడు పోతున్నాయి. రేపు సాయంత్రం కల్లా బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
Read Also : Coolie : కూలీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్
బుక్ మై షోలో టికెట్ సేలింగ్ జరుగుతోంది. యూఎస్ లో ఇప్పటికే 15వేలకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. అక్కడ షోలు పెంచే ఆలోచనలో ఉన్నారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బజ్ బాగా పెరిగిపోయింది. కంటెంట్, విజువల్స్, విజయ్ లుక్స్, యాక్షన్ అన్నీ అదిరిపోయాయి. పైగా గౌతమ్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజక్ తోడయ్యాయి. అందుకే మూవీపై భారీ హైప్ ఉంది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా వీకెండ్ కల్ల భారీగా టికెట్లు అమ్ముడు పోవడం ఖాయం అన్నట్టు కనిపిస్తోంది.
Read Also : Film Chamber : ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదుల గొడవ..
Acing the Box Office in a fiery way 🔥#Kingdom crosses 100K+ tickets already sold on @BookMyShow and the mania is striking big in every nook and corner 💥💥
🎟️ – https://t.co/4rCYFkA5dI#KingdomOnJuly31st @TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/WQkCWAXBnz
— Sithara Entertainments (@SitharaEnts) July 29, 2025