Kiccha Sudeep Sends Legal Notice For 10 Crore To Producers MN Kumar and MN Suresh: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తమను మోసం చేశాడంటూ.. నిర్మాతలు ఎంఎన్ కుమార్, ఎంఎన్ సురేశ్‌లు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల క్రితం సుదీప్ తమతో ఓ సినిమా ఒప్పంద కుదుర్చుకున్నాడని, అందుకు తమ వద్ద నుంచి రూ.9.10 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడని.. కానీ ఇప్పటివరకూ తమకు డేట్స్ కేటాయించలేదని ఆ నిర్మాతలు వాపోయారు. తాము సుదీప్‌ని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నంచినా.. అతని నుంచి స్పందన లేదన్నారు. కోటిగొబ్బ -3, విక్రాంత్ రోనాల తర్వాత సినిమా ప్రారంభిస్తానని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ మాట తప్పాడన్నారు. ఈ సినిమా కోసం ‘ముత్తట్టి సత్యరాజు’ అనే టైటిల్‌ను రిజిస్ట్రేషన్ చేశామని.. సుదీప్ ముందుకు రాకపోతే తాము ధర్నా చేస్తామని.. ఇప్పటికే సమస్యని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ ముందుకు తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు.
Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
మరి.. ఈ వ్యవహారంపై సుదీప్ ఎలా స్పందిస్తాడా? అని వేచి చూడగా, అతడు అందరి అంచనాలకు భిన్నంగా సీరియస్ స్టెప్ వేశాడు. ఆ నిర్మాతలు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్తూ.. కోర్టుని ఆశ్రయించాడు. ఆ ఇద్దరిపై రూ.10 కోట్లకు పరువునష్టం కేసు దాఖలు చేయడంతో పాటు బేషరతుగా వాళ్లు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించాడు. తన పరువుకు నష్టం కలిగించేలా ఆ ఇద్దరు వ్యాఖ్యలు చేశారని, లీగల్ నోటీసులు పంపిన మూడు రోజుల్లోపే క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని కోరాడు. ప్రింట్, విజువల్ మీడియాలో తమ క్షమాపణల్ని ప్రచురించాలని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నాడు. అలాగే.. తన పరువుకి నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యల్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. ఒకవేళ వాళ్లు నోటీసులకు అనుగుణంగా స్పందించడంలో విఫలమైతే.. తాను ఆ ఇద్దరిపై క్రిమినల్, సివిల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తానని కూడా ఈ లీగల్ నోటీసుల్లో తెలిపాడు. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లారు.
VD13: విజయ్ VD13 నుంచి క్రేజీ అప్డేట్.. నెక్ట్స్ అక్కడే!