Hanu-Man : అంజమ్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ హీరో
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం “HANU-MAN”. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత స్వరకర్తలు మ్యూజిక్ అందిస్తున్నారు. అందులో అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటోంది.
Read Also : Bheemla Nayak Hindi Trailer : బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే !
Also Read
కాగా విషయంలోకి వస్తే ఈరోజు సినిమాలో నుంచి అంజమ్మ ఫస్ట్ లుక్ విడుదలైంది. కోలీవుడ్ బాద్షా కిచ్చా సుదీప్ అంజమ్మ క్యారెక్టర్లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్‌లుక్‌ని ఆమె పుట్టినరోజుకి ఒక రోజు ముందు విడుదల చేశారు. బాగా కోపంగా ఉన్న ఈ బ్యూటీ విలన్లను ఇరగదీస్తున్నట్లుగా కన్పిస్తోంది. చేతిలో కొబ్బరికాయల గుత్తితో వధువు వేషంలో వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
Best wshs to the entire team ..
Introducing the Mighty “Makkal Selvi” as the braveheart #Anjamma from the World of AnjanadriAdvance HBD @varusarath5 🤩
-Team #HanuManHANU🔶MAN
A @PrasanthVarma Film pic.twitter.com/qxEG5RiKW9— Kichcha Sudeepa (@KicchaSudeep) March 4, 2022
తాజావార్తలు
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..
-
UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..
-
Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
-
OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!