ప్రస్తుతం హీరోయిన్లు జీరో సైజ్ మీద మోజు పడుతున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలు ఒక్కసారిగా బక్కచిక్కి కనిపిస్తున్నారు. ఎంత అవకాశాల కోసం వారు కష్టపడినా అభిమానులు మాత్రం బొద్దుగా ముద్దుగా ఉన్న రూపాలనే ఇష్టపడుతున్నారు. రకుల్, షాలిని పాండే, అవికా గోర్, అను ఇమ్మాన్యుయేల్ లాంటి భామలు ముద్దుగానే బావున్నారని అభిమానులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ కూడా బక్కచిక్కి కనిపించడం అభిమానులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మీరు కూడా ఇలా అయిపోయారా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఆ సీనియర్ నటి ఎవరు అంటే.. కేరళ కుట్టి ఖుష్బూ సుందర్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఖుష్బూ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఒకానొక సందర్భంలో ఖుష్బూకు తమిళ్ అభిమానులు గుడి కట్టి మరి పూజలు చేసారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
ఇక ముద్దుగా బొద్దుగా కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిజీ నటిగా మారిపోయింది. స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా మారి అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తోంది. ఇక తాజాగా ఖుష్బూ బక్కచిక్కి కనిపించింది. గతకొన్ని నెలలుగా ఆమె స్ట్రిక్ట్ గా వర్క్ అవుట్స్, డైట్ చేసి సన్నజాజి తీగల మారిపోయింది. తాజాగా ఖుష్బూ ను చూసి అభిమానులు అవాక్కవుతున్నారు. అస్సలు గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది. దీంతో అభిమానులు ఆమెను చూసి షాక్ తినడమే కాకుండా తమ ఆవేదనను తెలుపుతున్నారు. మీరు మునపటిలా ఉంటేనే బావున్నారు.. ఇప్పుడు ఇలా చూడాలేకపోతున్నాం అని కొందరు.. మీకేమైనా హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా..? ఎందుకు ఇలా తయారయ్యారు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ఖుష్బూలో మునుపటి కళ లేదని తెలుస్తోంది. ఇకపోతే ఆమె ప్రస్తుతం పలు సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తోంది.