కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. యావత్ ప్రపంచ సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 14 న రిలీజ్ కాబోతుంది. ఇక దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. నేడు ముంబైలో అడుగుపెట్టిన రాఖీ భాయ్ అండ్ టీమ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో యష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లతో యష్ ని పోలుస్తూ అక్కడి యాంకర్ మాట్లాడగా ” నన్ను ఆ స్టార్లతో పోల్చకండి.. వారు సూపర్ స్టార్లు.. వారిని చూసే నేను సినిమాల్లోకి వచ్చాను. ఇండస్ట్రీకి వారు మూల స్తంభాలు… వారితో నన్ను పోల్చడం సరికాదు అని చెప్పుకొచ్చాడు.
ఇక సౌత్ ఇండస్ట్రీపై యష్ మాట్లాడుతూ ” కెజిఎఫ్ 2 ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాం. సినిమాకు భాషతో సంబంధం లేదు. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ , బాలీవుడ్ అని అనుకోవడం కాదు.. ఇదంతా ఒకటే ఇండస్ట్రీ.. ఇండియన్ ఇండస్ట్రీ.. ఇక్కడ భాష అవసరం లేదు. నా దృష్టిలో ప్రతి సినిమా అలాగే రావాలి. ఈ విధానాన్ని రాజమౌళి సర్ మొదలుపెట్టారు.. మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ప్రజలకు కావాల్సింది వినోదం.. దేశం ఏదైనా, బాష ఏదైనా కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. అందరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఇండస్ట్రీ.. ఇండియన్ ఇండస్ట్రీ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి యష్ చెప్పిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటూంరేమో చూడాలి.