ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న పేరు ప్రశాంత్ నీల్. ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ “కేజీఎఫ్-2″తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు మరి ! ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ షోకు కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తరువాత పాజిటివ్ టాక్ తో రికార్డులను తొక్కుకుంటూ వెళ్ళింది “కేజీఎఫ్” టీం. అయితే ఇప్పటిదాకా టీం సక్సెస్ ను జస్ట్ థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేసింది. సాధారణంగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ హంగామా చేస్తున్న ఈరోజుల్లో థియేటర్లలో ఇంతటి సునామీ సృష్టించిన ‘KGF2’ సినిమాకు సంబంధించి ఎలాంటి సెలెబ్రేషన్స్ జరగలేదు.
Read Also : Acharya : కాజల్ వెర్షన్ తీసేశారా? చెర్రీ షాకింగ్ కామెంట్స్
ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన హీరో యష్, నిర్మాత విజయ్ తో కలిసి తాజాగా కేక్ కట్ చేశారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు వసూలు చేసింది. దీంతో ‘కేజీఎఫ్-2’ టీం టార్గెట్ కంప్లీట్ అయ్యిందని, అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న టీం ఇప్పుడు కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ‘కేజీఎఫ్’ టీం మెంబర్స్ కన్పించలేదు. కానీ యష్, నిర్మాత విజయ్, దర్శకుడు ప్రశాంత్ మాత్రమే కన్పిస్తున్నారు. ఇక నెక్స్ట్ యష్, ప్రశాంత్, విజయ్ ల ప్రాజెక్ట్ లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.