కరోన కారణంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పూర్తిగా చప్పబడిపోయింది, పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు, స్టార్ హీరోలు సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేసినా ముందున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ భయంతో 2023 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ సినిమాని వాయిదా వేశాడు రాజమౌళి. ఈరోజు సినిమాని వాయిదా వేస్తున్నాం కానీ తిరిగి మేము థియేటర్స్ లోకి వచ్చిన రోజు ఇండియన్ సినిమా గ్లోరిని బ్రింగ్ బ్యాక్ చేస్తామని చెప్పాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మార్చ్ 25న ఆడియన్స్ ముందుకి తెచ్చాడు, థియేటర్స్ దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. రాజమౌళి మ్యాజిక్ వర్కౌట్ అయ్యి ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల్ని మారుస్తూ 1100 కోట్లు రాబట్టింది. కరోనా టైం పీరియడ్ లో రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేసాడని ట్రేడ్ వర్గాలు కూడా ఫుల్ హ్యాపీ అయ్యాయి. ఈ యాక్షన్ ఎపిక్ మూవీ రిలీజ్ అయిన మూడు వారాలకి, సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం ఆర్ ఆర్ ఆర్ రికార్డులని కూడా బ్రేక్ చేస్తూ ఒక సినిమా రిలీజ్ అయ్యింది, అదే KGF 2.
ఏ సినీ అభిమాని కలలో కూడా రాజమౌళి సినిమా కలెక్షన్స్ ని ఇంకో డైరెక్టర్ బ్రేక్ చేస్తాడు అనుకోని ఉండరు. ఆ అసాధ్యాన్ని నిజం చేసి చూపించాడు ప్రశాంత్ నీల్. యష్ ని హీరోగా పెట్టి KGF చాప్టర్ 1కి సీక్వెల్ గా చాప్టర్ 2 రిలీజ్ అయ్యింది. హీరో క్యారెక్టర్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ పీక్ స్టేజ్ లో ఉంటాయి. కమర్షియల్ సినిమాలకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన KGF 2 సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ రూపు రేఖలని మార్చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షాన్ని కురిపిస్తే, KGF 2 ఏకంగా సునామీనే చూపించింది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా 1200 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా మళ్లీ KGF 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఈరోజు ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఫాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కలయికలోనే KGF 3 వస్తుంది, రాకీ భాయ్ మళ్లీ థియేటర్స్ ని కాంకర్ చేసుకోవడానికి వస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ ఎప్పుడు నిజం చేస్తాడో చూడాలి.