మలయాళ నటుడు దిలీప్ కుమార్ కిడ్నప్ కేసు రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. కొన్నేళ్ల క్రితం మలయాళ నటిని కిడ్నప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటనతో దిలీప్ కుమార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటికి వస్తుంది. మొన్నటికి మొన్న దిలీప్ బావ సూరజ్, మరో ఇద్దరు అసిస్టెంట్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇక తాజాగా ఈ కెడ్సులో దిలీప్ భార్య కావ్య మాధవన్ హస్తం కూడా ఉందని తేల్చి చెప్పేశారు. హీరోయిన్ పై లైంగిక దాడి జరిగిన రోజున కావ్య తన అన్న సూరజ్ ఫోన్ నుంచి దిలీప్ కి మెసెజ్ పెట్టి క్రైమ్ ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ప్లాన్ కి సంబంధించిన వాయిస్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కావ్య, సూరజ్, శరత్ ల మధ్య జరిగిన సంభాషణ మొత్తం క్లియర్ గా వినిపిస్తోంది. దీంతో పోలీసులు కావ్య మాధవన్ కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇకపోతే కావ్య, సదరు హీరోయిన్ కూడా మంచి స్నేహితులే.. దీంతో కావ్య ఫోన్ చేయగానే హీరోయిన్ వెంటనే నమ్మి కారులో ఆమె చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడినుంచి సూరజ్ ఆమెను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇక దిలీప్ కు హీరోయిన్ పై పగ పెంచుకోవడానికి ముఖ్య కారణం.. ఆమె కావ్య మాధవన్ తో దిలీప్ కు ఉన్న ఇల్లీగల్ ఎఫైర్ గురించి మొదటి భార్య మంజు వారియర్ కి చెప్పడం.. దాంతో ఈ జంట విడిపోయింది. ఇక తనను, తన భార్యను విడదీసిన హీరోయిన్ పై కక్ష పెంచుకున్న దిలీప్ హీరోయిన్ పై పగ తీర్చుకోవాలని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కావ్య మాధవన్ ను దిలీప్ రెండో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త మాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది.