మహానటి సినిమాలో సావిత్రమ్మగా నటించి నేషనల్ అవార్డ్ గెలుచుకుంది కీర్తి సురేష్. బండిల్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్, మహానటి తర్వాత ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ‘దసర’. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన దసర సినిమాలో కీర్తి సురేష్ ‘వెన్నల’గా నటించింది. అంగన్వాడి స్కూల్ టీచర్ గా వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ చూపించిన ఎమోషన్స్ ఆడియన్స్ కి కట్టి పడేసాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో సరదాగా, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా వేరియే షన్స్ చూపించిన కీర్తి సురేష్, మరో పదేళ్ల పాటు గుర్తుండి పోయే పాత్రగా ‘వెన్నెల’ని నిలబెట్టింది. మెయిన్ గా దసర సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చిన ఎపిసోడ్, ఆడియన్స్ నుంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లోకి తెచ్చిన సెగ్మెంట్ కీర్తి సురేష్ డాన్స్. ఇంటర్వెల్ బ్లాక్ కి కాసేపు ముందు వచ్చే ‘సెలబ్రేషన్ ఆఫ్ వెన్నెల’ ఎపిసోడ్ కీర్తి సురేష్ లోని నటిని పీక్ స్టేజ్ లో ప్రెజెంట్ చేసింది. నిమిషం పాటు ఉండే ఒక సింగల్ టేక్ బిట్ మ్యూజిక్ కి కీర్తి సురేష్ చేసిన డాన్స్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది.
ఒక పక్కా తెలంగాణా పల్లెటూరి అమ్మాయి, తన పెళ్లి బారత్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని తన బాడీ లాంగ్వేజ్ లో ఉట్టి పడేలా చేసిన కీర్తి సురేష్, ఈ డాన్స్ బిట్ కోసం 25 టేకులు తీసుకుందట. జిత్తు మాస్టర్ ఖొరియోగ్రఫీకి కీర్తి సురేష్ ప్రాణం పోస్తూ, ఒక్క చిన్న మిస్టేక్ కూడా రాకుండా… పెర్ఫెక్ట్ గా వచ్చే వరకూ అదే ఎనర్జీతో టేకులు తీసుకుంటూనే ఉందని దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తెలిపాడు. ఈరోజు సినిమాలో చూసింది 25వ టేక్ అని శ్రీకాంత్ ఓడెల రివీల్ చేశాడు. అన్నిసార్లు ఒకే బిట్ ని, అదే జోష్ తో చేసింది అంటే కీర్తి సురేష్ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతైనా నేషనల్ అవార్డ్ విన్నర్ కదా, ఒక క్యారెక్టర్ కి ఏం కావాలో ఆమెకి చాలా బాగా తెలుసు. మరి నెక్స్ట్ ఇయర్ కూడా కీర్తి సురేష్ బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.