Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు. ఇక ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసిఉంటుంది అని పెద్దలు చెప్తారు. అలాగే గుర్తుండిపోయే ప్రతి పాత్ర మీద ఒక నటుడు పేరు రాసి ఉంటుంది. ఆ ఒక్క పాత్ర వారి జీవించినా మరణించినా ప్రేక్షకుల మనస్సులో మాత్రం చెరిగిపోకుండా ఉంటుంది. ఒక హీరోయిన్ కెరీర్ లో ఎన్ని పాత్రలు అయినా చేయని.. ఆ గుర్తుండిపోయే పాత్రనే ఆమె జీవితం మొత్తం మార్చేస్తుంది. కీర్తి సురేష్.. కాదు కాదు మహానటి. నటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటన.. ఎన్నేళ్లు అయినా కీర్తిని గుర్తుంచుకునేలా చేస్తుంది. సావిత్రిగా కీర్తి నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. అయితే ఈ పాత్ర చేసే ముందు కీర్తి ట్రోల్ చేయబడింది అని చాలా తక్కువమందికి తెలుసు. మహానటి సావిత్రి బయోపిక్ లో నువ్వెంటీ.. నీకు సెట్ అవ్వదు అని ఎంతోమంది విమర్శించారు. ఇదే విషయాన్నీ కీర్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న దసరా ప్రమోషన్స్ లో ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది.
Manchu Manoj: అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన సారథి.. అసలు ఎవరితను..?
“మహానటి సినిమాను ఒప్పుకున్న సమయంలో నేను చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. నువ్వు మహానటి ఏంటి,
నువ్వు ఆ పాత్రకి ఎలా సరిపోతావు అంటూ కామెంట్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు నాగి.. ఈ ప్రాజెక్ట్ కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మొదట నో చెప్పాను. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టుబట్టి నాపై నాకు నమ్మకాన్ని కలిగించి ఇది నువ్వు చేయగలవని ధైర్యాన్ని ఇచ్చి నాతో చేయించాడు. ఆయన నన్ను ఎంతో నమ్మారు. నాకు అదే అనిపించింది. నన్నెందుకు నమ్మకూడదు అని, అందుకే ధైర్యంగా మహానటి చేశాను. సావిత్రమ్మ కూతురు ను అడిగి ఆమె ఎలా ఉండేవారు.. ఎలా నడిచేవారు.. అన్ని నేర్చుకున్నాను. మహానటి సినిమాలో నటించే సమయంలో.. నటించిన తర్వాత ఎదురయ్యే సవాలను విమర్శలను ముందుగానే కొంతమేరకు ఊహించగలిగాను. ఇక ఈ విషయంలో చిత్ర బృందం నాకు ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ సినిమా తరువాత కీర్తి అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేదు. దసరా సినిమాలో ఆమె డీ గ్లామర్ రోల్ చేస్తుంది. మరి ఈ సినిమాతో కీర్తి మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.