Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఎట్టకేలకు థియేర్లలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ సినిమాలో మేం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కథ చాలా బాగా నచ్చింది. అందుకే మా మిస్టేక్స్ ను పెద్దగా పట్టించుకోలేదు. చివరి గంటల సేపు వారి ఎమోషన్స్ హైలో ఉంటాయి. ఆ హైతోనే బయటకు వచ్చారు. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం. ప్రేక్షకులు ఏ మూడ్ తో బయటకు వస్తే మన సినిమాకు ఆదరణ అలా ఉంటుంది.
Read Also : Kannappa : కన్నప్ప రెండోరోజు కలెక్షన్లు ఎంతంటే..?
ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడానికి కారణం రామ్ గోపాల్ వర్మ గారే. మార్చిలో ఆయన మా ఇంటికి నాన్నగారిని కలవడానికి వచ్చారు. అప్పుడు కన్నప్ప మేకింగ్ వీడియోను నాలుగు నిముషాలు ఆయనకు చూపించాను. ఈ సినిమా గ్రాఫిక్స్ లేకుండా చూసిన వీవీఎస్ రవి దాని గురించి ఆర్జీవీకి చెప్పారు. విష్ణు ఇంత కష్టపడుతున్నాడు వీఎఫ్ ఎక్స్ ను ఎందుకు వదిలిపెట్టడం. అది ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా అన్నారు ఆర్జీవీ. ఆయన మాటలతో నాకు వీఎఫ్ ఎక్స్ మీద ఆలోచన పెరిగింది. అందుకే దాన్ని వదిలేయొద్దని ఫిక్స్ అయి సినిమాను వాయిదా వేశాను. అదే ఈ రోజు ప్లస్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.
Read Also : SHine Tom Chaco : రోడ్డు మీద కూర్చుని ఏడ్చాను.. దసరా విలన్ ఎమోషనల్..