“సైరా నరసింహా రెడ్డి” అనే తెలుగు పీరియాడిక్ డ్రామాలో చివరిసారిగా తెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. చిరంజీవి చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయ. “ఆచార్య” పూర్తయ్యాక మరో రెండు రీమేక్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరు. మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నాడు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ఆ తరువాత అజిత్ కుమార్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ “వేదాళం” రీమేక్ లో కూడా చిరు కనిపించనున్నారు. ఈ రీమేక్ కు దర్శకత్వం వహించడానికి డైరెక్టర్ మెహర్ రమేష్‌ను తీసుకున్నారు.
Read Also : అజిత్ కి ప్రేమ, ద్వేషం రెండూ కావాలట!
తాజా సమాచారం ప్రకారం జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. “వేదాళం” రీమేక్ లో ఆమె చిరంజీవి సోదరి పాత్రలో కనిపించనుంది. కీర్తి ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కూడా కేటాయించిందట. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతకు ముందు సాయి పల్లవి ఈ పాత్రలో నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు మేకర్స్ కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” సినిమా హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.