తమిళ నటుడు కవిన్ హీరోగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కిస్’. ‘దాదా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కవిన్, ఈసారి పూర్తి స్థాయి లవ్ అండ్ రోమన్స్ ఫన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణన్ ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రోమియో పిక్చర్స్ బ్యానర్‌పై రాహుల్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
Also Read : ANR : 101 ఏళ్ల ఏఎన్ఆర్ జ్ఞాపకార్థం.. అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్
ట్రైలర్ కనుక పరిశీలిస్తే కవిన్ ప్రేమ, ముద్దులంటే అస్సలు ఇష్టపడని యువకుడిగా కనిపిస్తున్నారు. గతంలో ఎదురైన కొన్ని సంఘటనల వల్ల ప్రేమపై నెగిటివ్ దృక్పథం ఏర్పరచుకున్న అతడి జీవితంలోకి ‘ప్రీతి’ అనే అమ్మాయి ప్రవేశించిన తర్వాత జరిగే మార్పుల చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఓవరల్‌గా ట్రైలర్‌లో కామెడీ, రొమాన్స్, ఫీల్ గుడ్ ఎమోషన్స్ కలగలిపి చూపించడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ముఖ్యంగా కవిన్ పాత్రలోని ఇన్నోసెన్స్, హీరోయిన్‌తో సాగే ఫన్ మోమెంట్స్ యూత్‌ను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీలోనూ కిస్ విడుదల కాబోతోంది. దీంతో కవిన్ పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ రొమాంటిక్ కామెడీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.