కత్రినా- విక్కీ గ్రాండ్ వెడ్డింగ్ వెనుక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ స్టార్ కత్రినా కైఫ్, క్రేజీ హీరో విక్కీ కౌశల్ గ్రాండ్ వెడ్డింగ్ గురువారం అంగరంగ వైభవంగా రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ కోటలో జరగబోతోంది. అఫీషియల్ గా తమ లవ్ గురించి వెడ్డింగ్ గురించి పెదవి విప్పకుండానే విక్కీ, కత్రినా పెళ్ళి పీటలు ఎక్కేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఫలానా రోజు ఎంగేజ్ మెంట్, ఫలానా రోజు పెళ్ళి అంటూ సోషల్ మీడియాలో వరదెత్తిన వార్తలకు ఇక ఫుల్ స్టాప్ పడబోతోంది. చిత్రం ఏమంటే.. కత్రినా కైఫ్ దీర్ఘకాల ప్రియుడు సల్మాన్ ఖాన్ ఈ పెళ్ళికి హాజరు కాలేకపోతున్నాడు. ‘ద… దబంగ్’ మూవీ షూటింగ్ నిమిత్తం సల్లూభాయ్ రియాజ్ కు బయలు దేరుతున్నాడు. అయితే అతని కుటుంబంతో ఉన్న అనుబంధం దృష్ట్యా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులందరినీ ఈ వేడుకకు కత్రినా ఆహ్వానించారు.
ఇప్పటికే అయిపోయిన పెళ్ళి!
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్ళి సంప్రదాయబద్ధంగా గురువారం జరుగుతోంది కానీ ఇప్పటికే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం వారు డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే ముంబైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారన్నది సమాచారం. అయితే దీనిని కూడా వారెక్కడా ధృవీకరించలేదు. చిత్రం ఏమంటే… పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతున్నా సన్నిహిత బంధువులు కాకుండా అతిధులు మాత్రం కేవలం 120 మందికి మించరని తెలుస్తోంది. అతి జాగ్రత్తగా వడగొట్టి… అత్యంత సన్నిహితుల జాబితాను తయారు చేసుకుని కత్రినా, విక్కీ ప్రత్యేకంగా వారిని ఆహ్వానించారట. చిత్రం ఏమంటే… ఈ గెస్ట్ లకు సైతం ఓ సీక్రెట్ కోడ్ ఇచ్చి, దానిని చెప్పిన తర్వాతే ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇస్తారట. అంతేకాదు… సెల్ ఫోన్స్ సైతం పెళ్ళి వేడుకకు నాట్ అలౌడ్ అని చెబుతున్నారు. పెళ్ళి ఫోటోలను సైతం ఈవెంట్ నిర్వహిస్తున్న సంస్థే విడుదల చేస్తుందట. అలానే ఈ గ్రాండ్ వెడ్డింగ్ లోని ప్రతి వేడుకను కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేసి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు అమ్మే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read
రామాయణంలో పిడకల వేట!
శుభమా అని కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం చేసుకుంటుంటే… ఊహించని అడ్డంకులు కూడా ఎదురవుతున్నాయి. పెళ్ళి జరుగుతున్న సిక్స్ సెన్సెస్ కోట కు వెళ్ళే దారిని భద్రత దృష్ట్యా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ 6 నుండి 12వ తేదీ వరకూ మూసేసింది. అదే ఇప్పుడు కత్రినా, విక్కీలకు చికాకులను తెప్పించింది. హోటల్ కు వెళ్ళే దారిలో ఉన్న చౌతా మాత టెంపుల్ ను దర్శించాలనుకునే వారికి ఇలా రాస్తాను బంద్ చేయడంతో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికుడొకరు కేసు వేశాడు. పెళ్ళి చేసుకోవడానికి తానేమీ అడ్డు చెప్పడం లేదని, కానీ ఈ పురాతన మందిరానికి వెళ్ళే భక్తులకు అసౌకర్యం కలగకుండా దారి ఇవ్వమని కోరాడు.
ఇదేం కొత్త కాదు సుమా!
కత్రినా, విక్కీ వెడ్డింగ్ ఎంత గ్రాండ్ గా జరుగబోతోందనే విషయాన్ని పక్కన పెడితే, తనకంటే ఐదేళ్ళు చిన్నవాడైన వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవడం మాత్రం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే దీనికి సమాధానంగా గతంలో బాలీవుడ్ హీరోయిన్లు ఎవరెవరు తమకంటే చిన్నవాళ్ళను పెళ్ళి చేసుకున్నారో చెప్పే ప్రయత్నం మరికొందరు చేస్తున్నారు. ప్రియాంక చోప్రా కంటే జోనస్ పదేళ్ళు చిన్నవాడిని, అలానే సల్మాన్ మాజీ ప్రియురాలు ఐశ్వర్యా రాయ్ కంటే ఆమె పెళ్ళి చేసుకున్న అభిషేక్ బచ్చన్ సైతం మూడేళ్ళు చిన్నోడేనని చెబుతున్నారు. ఇక 32 సంవత్సరాల కునాల్ ను సోహా అలీఖాన్ పెళ్ళి చేసుకున్న విషయం గుర్తు చేస్తున్నారు.
ఇదే జాబితాలో రెండేళ్ళ చిన్నవాడైన అంగద్ ను చేసుకున్న నేహా ధూపియా, మహేశ్ బాబును మనువాడిన నమ్రతా శిరోద్కర్, కరన్ ను పెళ్ళాడిన బిపాసా బసు పేర్లూ వచ్చేశాయి. ఇంకొందరు ఇంకా వెనక్కి వెళ్ళి సైఫ్ అలీఖాన్ ను చేసుకున్న అమృతా సింగ్, సునీల్ దత్ ను పెళ్ళాడిని నర్గీస్ పేర్లూ చెప్పేసి… ఇది అసలు సమస్యే కదాని తేల్చేస్తున్నారు. మంగళవారం సంగీత్, బుధవారం మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక వెడ్డింగ్ సెర్మనీనే మిగిలి ఉంది. అది కూడా సవ్యంగా జరిగి ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ మరికొందరికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!