Katrina Kaif:బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది ఘనంగా వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఎంత సీక్రెట్ గా జరిగినా ఈ పెళ్లి నుంచి అడపాదడపా ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట వైరల్ గా కూడా మారాయి. పెళ్లి తరువాత ఈ జంట తమ కెరీర్ లో బిజీగా మారిపోయారు. ఇక తాజాగా తన పెళ్లి రోజు విషయాలను కత్రీనా ఒక ఇంటర్వ్యూలో పంచుకోంది. తన పెళ్లిలో జరిగిన ఒక పెద్ద గోదావ గురించి కూడా కత్రీనా బయటపెట్టింది.
“ఆరోజు పెళ్ళిలో అంతా కోలాహలంగా ఉంది. నేను పెళ్లి పీటలు మీద కూర్చున్నా.. వెనక నుంచి పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అని అడిగితే నా కజిన్స్, విక్కీ ఫ్రెండ్స్ కొట్టుకొంటున్నారని తెలిసింది. అది ఎంత పెద్ద గొడవ అంటే ఒకరిపై ఒకరు కుర్చీలు, బల్లలు విసురుకున్నారు. నేను పిల్ల పీటలు మీద ఉండడంతో అక్కడికి వెళ్ళలేకపోయాను” అని చెప్పుకొచ్చింది. అయితే ఆ గొడవ ఎందుకు జరిగింది. చివరికి ఆ గొడవలో ఎవరు గెలిచారు అనేది మాత్రం క్యాట్ చెప్పలేదు. ఏదిఏమైనా ప్రతి పెళ్ళిలో జరిగినట్లే క్యాట్- విక్కీ పెళ్ళిలో కూడా గొడవలు జరిగాయన్న మాట అంటూ నెటిజన్లు నోళ్లు నొక్కుకుంటున్నారు.