Katrina Kaif:బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రీనా కైఫ్- విక్కీ కౌశల్ గతేడాది డిసెంబర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం విదితమే. అయితే వీరి పెళ్లి ఎంత రహస్యంగా జరిగింది అంటే రేపు పెళ్లి అనగా ఈరోజు కూడా అసలు వీరిద్దరికి పెళ్లి జరుగుతుందా..? అనేంత అనుమానం వచ్చింది. ఇక తాజాగా ఈ రహస్య పెళ్లి వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది తెలిసిపోయింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రీనా ఈ విషయమై మాట్లాడుతూ”మా పెళ్ళి ఇంత రహస్యంగా జరగడానికి కారణం కరోనా.. ఆ సమయలో నా కుటుంబం మొత్తం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అందరూ కరోనా బారిన పడ్డారు. అప్పుడు వారిని చూసినప్పుడు నేను ఎంతో బాధపడ్డా.. వారి విషయంలో మరోసారి ఛాన్స్ తీసుకోదల్చుకోలేదు. అందుకే బయటవారిని ఎవరిని పిలవకుండా ఇలా రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. చాలా తక్కువమందిని పిలిచినా మా పెళ్లి ఎంతో అద్భుతంగా జరిగింది. మా పెళ్లి విషయంలో నేను, విక్కీ ఎంతో హ్యాపీగా ఉన్నాం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక దీంతో విక్కీ, కత్రీనా ల పెళ్లి రహస్యం బయటపడిపోయింది. పెళ్లి ఎలా జరిగినా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకొంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రస్తుతం విక్కీ, కత్రీనా ఇద్దరు తమతమ కెరీర్ లో బిజీగా మారారు.