Karthi: ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత పెద్ద మీడియమో గుర్తు వస్తుందని కార్తీ చెప్పుకొచ్చాడు. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ ప్రధానపాత్రల్లో స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. సెప్టెంబర్ 30 న ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపధ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్.. ఈ వేదికపై కార్తీ మాట్లాడుతూ” ఇలాంటి ఒక పెద్ద సినిమా చేసినప్పుడే సినిమా ఎంత పెద్ద మీడియమో గుర్తుకు వస్తుంది. ఇక్కడ రిలీజీయన్ కానీ, కాస్ట్ కానీ ఇవన్నీ పక్కన పెట్టి మనందరిని కలిపి సినిమ తీసుకువస్తోంది. మణిరత్నం గారి 40 ఏళ్ల కల.. 40 ఏళ్ళ తరువాత ఆయన ఈ సినిమాను తెరపైకి తెచ్చారు. అందరు అడుగుతున్నారు ఇది బాహుబలి సినిమాలా ఉంటుందా..? అని. బాహుబలి సినిమా ఇప్పటివరకు మనం చూశాం.. చూస్తూనే ఉన్నాం. మనకు నచ్చుతోంది.. ఇంకో బాహుబలి మనకు అవసరం లేదు.. మనం ఇండియాలో పుట్టాం.. ఎన్నో కథలు ఉన్నాయి.. ఎంతోమంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలు వేరు.
70 ఏళ్లుగా బెస్ట్ సెల్లింగ్ నవల గా ఉన్న కథను మణిరత్నం గారు మా అందరితో తీశారు. ఈ సినిమాలో రొమాన్స్ ఉంది, అడ్వెంచర్ ఉంది.. రాజకీయాల్లో ఒక పార్టీ ని తొక్కేయడానికి బయటవాళ్లే కాకుండా పార్టీలో ఉన్నవారు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇదే వందేళ్ల క్రితం కూడా జరిగింది. అదే సినిమాలో చూపించాం. ఈ సినిమాలో పని చేయడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మణిరత్నం గారికి, రెహమాన్ గారికి థాంక్స్” అని తెలిపాడు. సినిమాలో పనిచేసినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు. సినిమాను సెప్టెంబర్ 30 న ఆదరించామని కార్తీ కోరుతూ ముగించాడు.