రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ బచ్చన్ మనవడు రణవీర్. ఈ తరం ప్రేమికులు ‘రాకీ అండ్ రాణీ’ మధ్య లవ్… అలాగే, దర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా సినిమాలో హైలైట్ గా ఉంటాయట.
ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ కు దర్శకుడిగా చివరి చిత్రం ‘యే దిల్ హై ముష్కిల్’. ఆ సినిమా తరువాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకున్న ‘కేజో’ ఇప్పుడు తనకు బాగా అలవాటైన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ అవ్వాల్సి ఉండగా, అదే డేట్ ని కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహజాదా’ సినిమా రిలీజ్ అవుతుండడంతో ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ విడుదలని వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ప్రకారం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా జూలై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టొరీగా బయటకి రానున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాతో కరణ్ జోహార్ మంచి హిట్ కొడతాడని బీటౌన్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ‘కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో న హో, కభి అల్విదా నా కెహ్నా, మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి సోల్ ఉన్న సినిమాలని డైరెక్ట్ చేసిన కరణ్ జోహార్, మరోసారి ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చూపించి ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.