Taapsee Pannu: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయిన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. బాలీవుడ్ లో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉంటుంది. నిర్మొహమాటంగా తనపైకి వచ్చినవారికి అంతే రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. గతంన్లో కంగనా, తాప్సీమధ్య జరిగిన వివాదాలు చిన్నవేమి కాదు. ఇక బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తో తాప్సీ గొడవ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకానొక షో లో కరణ్ షోకు మీరు ఇప్పటివరకు ఎందుకు వెళ్లలేదు అన్న ప్రశ్నకు తాప్సీ ఘాటుగా సమాధానం చెప్పింది. బహుశా కరణ్ షోలో చెప్పుకొనేంత ఇంట్రెస్టింగ్ గా నా శృంగార జీవితం లేదేమో, అందుకే అతను నన్ను పిలవలేదు అని చెప్పుకొచ్చి అందరికి షాక్ ఇచ్చింది. అప్పట్లో తాప్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.
ఇక తాజాగా ఇదే విషయమై కరణ్ తన అక్కసును చూపించాడు. తాప్సీ కి సెటైర్ వేసి మరీ లాక్ చేశాడు. అసలు విషయమేంటంటే.. ఇటీవలే కాఫీ విత్ కరణ్ షో కు సోషల్ మీడియా సెలబ్రిటీస్ వచ్చారు. షోలో కొద్దిగా వైరైటీగా కరణ్ ను వారు ఇంటర్వ్యూ చేశారు. అందులో భాగంగా కరణ్ కు తాప్సీ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. “ఇండస్ట్రీకి వచ్చి విజయాపజయాలను అందుకుంటున్న వారిని మీరెందుకు పిలవలేదు.. అందులో తాప్సీ కూడాఒకరు .. ఆమెను పిలవకపోవడానికి కారణం ఏంటి..? ” అని అడుగగా అందుకు కరణ్ కొద్దిగా వ్యంగ్యంగా సమాధానం చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ” మీ అందరికి తెలుసు ఇది 12 ఎపిసోడ్ల సీజన్. ఇప్పటివరకు ప్రేక్షకుల్ని అలరించిన జోడిలను ఎంపిక చేశాం. తాప్సీకి కుదిరే జోడి కోసం వెతుకుతున్నాం. అలాంటి వారు దొరికన్నపుడు ఖచ్చితంగా పిలిస్తాను. అప్పుడు కనుక ఆమె రాకపోతే నేను చాలా బాధపడతాను” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇప్పటివరకు తాప్సీ శృంగార విషయాలను పంచుకొనే వ్యక్తి దొరకలేదు.. అందుకే పిలవలేదు అని బాహాటంగానే చెప్పాడు. అణుడిలో ఆమె చెప్పిన దానికి కౌంటర్ వేశాడు. ఇక దీనికి తాప్సీఎలా స్పందిస్తుందో చూడాలి.