రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ ‘కాంతార'(KANTARA). హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లని రాబట్టింది. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన కాంతార సినిమా, 50 రోజులు అవుతున్నా మంచి బుకింగ్స్ ని రాబడుతునే ఉంది. ప్రీక్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ రిషబ్ శెట్టి బ్రీత్ టేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ సాంగ్ అద్భుతంగా ఉంటుంది. మొత్తం సినిమాకే ప్రాణం లాంటి ఈ సాంగ్ ని థియేటర్ లో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. కన్నడ నుంచి ఇండియా మొత్తం పాకిన కాంతార ఫీవర్ ఇప్పుడు ఒటీటీకి కూడా స్ప్రెడ్ అయ్యింది. చాలా రోజులు వెయిటింగ్ చేయించిన తర్వాత, కాంతార సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీని థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు, అక్కడ చూసి మళ్లీ చూడాలి అనుకున్న వాళ్లు అమెజాన్ ప్రైమ్ లో కాంతారా సినిమాని ఓపెన్ చేసి షాక్ అయ్యారు(KANTARA IN PRIME). దీనికి కారణం, కాంతారా సినిమాకి ప్రాణం లాంటి ‘వరాహ రూపం’ సాంగ్ సినిమాలో మారిపోవడమే.
అవును, థియేటర్స్ లో ఆడియన్స్ చూసిన సాంగ్ కి ఇప్పుడు ఒటీటీలో ప్లే అవుతున్న సినిమాలో ఉన్న పాటకి తేడా ఉంది(VARAAHA ROOPAM). దీంతో కాంతార సినిమాలో ఆ ఫీల్ పోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. రిషబ్ శెట్టిని, హోంబెల్ ఫిల్మ్స్ ని ట్యాగ్ చేస్తూ వరాహ రూపమా ఒరిజినల్ వెర్షన్ ని అప్డేట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, కాంతార సినిమాలో వాడిన వారహ రూపం సాంగ్ కి కాపీ రైట్స్ క్లైమ్ వచ్చి, విషయం కోర్ట్ వరకూ వెళ్ళడంతో మేకర్స్ ఆ సాంగ్ ని సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐదేళ్ల కితమే వరాహ రూపం సాంగ్ కి ఒరిజినల్ బీట్ ఉందని సమాచారం. అయితే ఆడియన్స్ మాత్రం, ఎంతో కొంత ఇచ్చి ఎదో రకంగా ఇష్యూ చేసే వాళ్లతో సెటిల్మెంట్ చేసుకోని… వరాహ రూపం ఒరిజినల్ సాంగ్ ని ప్లేస్ చేయమని చెప్తున్నారు. మరి కాంతార మేకర్స్ సెటిల్మెంట్ ఆలోచన చేస్తారో లేదో చూడాలి.