కాంతార చిత్రంలోని ‘వరహరూపం’ పాట కాపీరైట్‌ను ఉల్లంఘించారనే క్రిమినల్ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, దర్శకుడు రిషబ్ శెట్టికి సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ‘కాంతార’ చిత్రంలోని ‘వరహరూపం’ పాటను తొలగించాలని కేరళ హైకోర్టు విధించిన షరతుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కిరగందూర్, శెట్టి దాఖలు చేసిన పిటిషన్‌ను…
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ ‘కాంతార'(KANTARA). హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లని రాబట్టింది. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన కాంతార సినిమా, 50 రోజులు అవుతున్నా మంచి బుకింగ్స్ ని రాబడుతునే ఉంది. ప్రీక్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ రిషబ్ శెట్టి బ్రీత్ టేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ సాంగ్ అద్భుతంగా ఉంటుంది.…