Kannappa will be a kalakandam for younger generations says Manchu Vishnu: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోండగా దాదాపుగా ఈ మూవీ షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుందని తెలుస్తోంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు మేకర్స్. ఇలాంటి భారీ చిత్రానికి న్యూజిలాండ్ వాతావరణం సరిగ్గా సెట్ అవుతుందని భావిస్తున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేయగా మన తెలుగు ప్రేక్షకులకు కూడా మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేందుకు కన్నప్ప టీం ప్రయత్నిస్తోంది. దేవుడు సృష్టిలో న్యూజిలాండ్ అనేది అందమైన పెయింటింగ్ లాంటిది.. కన్నప్ప సినిమాకు న్యూజిలాండ్ అనేది పర్ఫెక్ట్ లొకేషన్ అని మేకర్స్ చెబుతున్నారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, కన్నప్పలోని ఎమోషన్‌ను న్యూజిలాండ్‌లోని లొకేషన్లు ఇంకా ఎలివేట్ చేస్తాయి అని మంచు విష్ణు తాజాగా వెల్లడించారు.
Prabhas: మోకాలి సర్జరీ తరువాత ప్రభాస్ ఫస్ట్ ఫోటో ఇదే!
ఈ మూవీని భారీ స్టార్ క్యాస్ట్ తో శ్రీకాళహస్తి గుడిలో ప్రారంభించారు. అక్కడే కన్నప్ప తన రెండు కళ్లను ఆ శివుడికి అర్పించేందుకు సిద్దపడ్డాడని నమ్మిక. ఇక న్యూజిలాండ్‌లోని ప్రకృతి దృశ్యాలను, అత్యాధునిక సినిమాటిక్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ కన్నప్ప సినిమాతో ప్రేక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపే దృశ్యకావ్యంగా రూపొందించాలని మంచు విష్ణు భావిస్తున్నారు. ‘న్యూజిలాండ్‌లో ప్రారంభించిన ఈ మూవీని అత్యుత్తమ రీతిలో చిత్రీకరించేందుకు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నాం. అగ్రశ్రేణి ప్రతిభావంతులు, నటీనటులు, అత్యాధునిక సాంకేతికతతో, రాబోతున్న తరాల వారికి గుర్తిండిపోయేలా ఓ కళాఖండంగా ఈ కన్నప్పను తెరకెక్కిస్తున్నామని’ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు, అలాగే భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ కన్నప్పలో భాగం కానుంది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.