కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా సినిమా అనౌన్స్ అయ్యింది. సూపర్ స్టార్ శివన్న హీరోగా నటిస్తున్న ఈ మూవీని మహా శివరాత్రి సంధర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘భైరతీ రణగళు’ అనే టైటిల్ తో శివన్న సినిమాని అనౌన్స్ చేశాడు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసిన శివన్న, ఆ పోస్టర్ లో ‘బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగీ’ కట్టుకోని కుర్చీలో కూర్చోని ఉన్నాడు. ఈ పోస్టర్ చూడగానే అందరికీ గతంలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమా గుర్తు రావడం గ్యారెంటీ. ఆ సినిమాలోని శివన్న లుక్ నే గోపీచంద్ మలినేని ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో బాలయ్యకి పెట్టాడు. ప్రశాంత్ నీల్ శిష్యుడు నర్తన్ డైరెక్ట్ చేసిన మఫ్టీ సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయ్యింది. ఇందులో సాంగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ సీన్స్ సూపర్బ్ గా ఉంటాయి. చాలా రోజుల తర్వాత శివన్నకి కమర్షియల్ గా సూపర్ హిట్ ఇచ్చింది మఫ్టీ సినిమా.
మఫ్టీ మూవీలో శివన్న టీం పేరు ‘భైరతి రణగళు’, ఈ మూవీలో శివన్నని పట్టుకోవడానికి వచ్చిన పోలిస్ గా శ్రీమురళి నటించాడు. అతని క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరొచ్చింది. పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాల ఉండే మఫ్టీ సినిమాకి సీక్వెల్ గానే ‘భైరతి రణగళు’ అనౌన్స్ అయ్యింది. ఈ ఒక్క అనౌన్స్మెంట్ తో శివన్న పేరు KFIలో మారుమోగుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాని శివన్న తన సొంత బ్యానర్ ‘గీత పిక్చర్స్’ ప్రొడక్షన్ నంబర్ 2గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆల్రెడీ మఫ్టీ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పేక్టేషన్స్ ని నర్తన్, శివన్నలు ఎంతవరకూ అందుకుంటారో చూడాలి.
The Era, Where It All Began! #BhairathiRanagal Is Here. @GeethaPictures #Narthan pic.twitter.com/LssjCsTOdT
— DrShivaRajkumar (@NimmaShivanna) February 18, 2023