కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజీ హీరోగా మారిన శాండిల్ వుడ్ యంగ్ యాక్టర్.. ఆ తర్వాత చతికిల పడుతూ వచ్చాడు. వరుస ప్లాప్‌లు పలకరిస్తున్న టైం లో టాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే ఊపుతో తాజాగా మరో గ్రిప్పింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు.. మరి ఇంతకు ఎవరా హీరో..? ఏ సినిమాతో.. అంటే ?
Also Read:Unni Mukundan: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఉన్ని ముకుందన్
మోనిష్ నాగరాజ్ అలియాస్ రిషి.. ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో. ‘ఆపరేషన్ అలివేలమ్మ’, ‘కవులదారి’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీని షేక్ చేశాడు. తక్కువ టైంలోనే క్రేజీ హీరోగా మారిపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి తన కెరీర్ కు ప్లేస్ కాలేకపోయాయి.ఇదే టైం లో వెబ్ సిరీస్ ‘సైతాన్’ లో మెయిన్ రోల్ చేసి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు తాజాగా తనకు అచ్చొచ్చిన మిస్టరీ త్రిల్లర్ స్టోరీని నమ్ముకున్ని ‘రుద్ర గరుడ పురాణ’ అనే మూవీతో పలకరించాడు. లాస్ట్ ఇయరే విడుదల కావాల్సిన ఈ సినిమా ఈ జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ.. రోజు రోజుకూ సినిమా థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. ఇందులో రిషి పోలీసాఫీసర్ గా కనిపించాడు. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. దానిలో చనిపోయిన వారంతా తిరిగి వచ్చాక ఏం జరిగిందనేది ఈ సినిమా కాన్సెప్ట్. అయితే తాజాగా ఈ సినిమా తెలుగు విడుదలకు సిద్ధం అయింది. తెలుగులో భారీ రైట్స్ కు డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసినట్లు టాక్. మరీ ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి.