కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆమెను భర్త, మామ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజగా ఆ బాధలను భరించలేని చైత్ర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ బాలజీ పోత్రాజ్, మామ కలిసి తన బ్యాంక్ ఖాతాను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆరోపించింది.
ఇక అంతేకాకుండా తన పేరుతో గోల్డ్ లోన్ తీసుకున్నారని, ఈ విషయం తనకు తెలిసి నిలదీసేసరికి తండ్రీకొడుకులు తనను హింసించారని ఫిర్యాదులో పేర్కొంది. వీరికి బ్యాంక్ మేనేజర్ కూడా హెల్ప్ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలియడంతో తన భర్త తనను చంపాలనుకుంటున్నాడని, కాపాడమని కోరింది. దీంతో చైత్ర ఫిర్యాదుమేరకు పోలీసులు ఆమె భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 468,406, 409, 420, 506 కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారం జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇకపోతే ఈ వార్త ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది/.