Kangana Ranaut Comments at Chandramukhi 2 Promotional Event: చంద్రముఖి 2 ప్రమోషనల్ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మాట్లాడుతూ నేను ఇంతకు ముందు దక్షిణాదిలో సినిమాలు చేశానని అన్నారు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో నటించా ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను ‘చంద్రముఖి2’తో పలకరిస్తానని, ఈ మూవీలో చంద్రముఖి పాత్ర తెలుగులో మాట్లాడుతుందని అన్నారు. వాసు గారు ఓ వారియర్ సినిమా చేయాలని నా దగ్గరకి వచ్చినప్పుడు నేను చంద్రముఖి 2లో చంద్రముఖిగా ఎవరు నటిస్తున్నారని అడిగా, ఎవరినీ తీసుకోలేదని అన్నారు. నేను నటిస్తానని అడగ్గానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టానని అన్నారు. ‘చంద్రముఖి’లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయని అన్నారు. చంద్రముఖిని పలు భాషల్లో చేశారు, అయితే జ్యోతికగారు ఆ పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా చేశారు నేను ఆమె నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు.
Lawrence: ఆమెకున్న సెక్యూరిటీ చూసి భయపడ్డా.. కంగనా గురించి లారెన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది కానీ ‘చంద్రముఖి2’లో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది. దాని కోసం డైరెక్టర్ వాసుగారు కొత్తగా నా పాత్రను తీర్చిదిద్దారని ఆమె అన్నారు. డైరెక్టర్ పి.వాసు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘చంద్రముఖి2’తో రాబోతున్నా, చంద్రముఖి సినిమాతో ‘చంద్రముఖి2’ను లింక్ చేసి ఈ కథను సిద్ధం చేశానని అన్నారు. కచ్చితంగా ఆడియెన్స్‌ను ఈ సినిమాను మెప్పిస్తుంది. తెలుగులో నాగవల్లి సినిమా ఉంది కానీ అందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. కానీ ఇందులో 17 ఏళ్ల ముందు కోట నుంచి వెళ్లి పోయిన చంద్రముఖి మళ్లీ ఎందుకు వచ్చిందనే పాయింట్‌తో చేశా, సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఆస్కార్ విన్నర్ కీరవాణిగారితో వర్క్ చేయటం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్, ఇళయరాజాగారి తర్వాత అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న సినిమా ఇది అన్నారు.