HHVM : టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని చెప్పడంతో అందరి దృష్టి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. సోషల్ మీడియాలో, ఇటు టాలీవుడ్ లో అందరి దృష్టి హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. ఈ మూవీపై కుట్ర జనరుగుతోందని.. అందుకే ఎగ్జిబిటర్లను కొందరు కావాలనే సీన్ లోకి తీసుకొచ్చారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేవలం హరిహర వీరమల్లు సినిమా మీదనే కుట్ర జరిగినట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఊగిపోతోంది. కానీ ఇక్కడే ఓ విషయాన్ని కూడా చర్చించుకోవాలి.
Read Also : Kavitha: కవిత లేఖ బయటకు ఎలా వచ్చింది..? లీకు వీరులెవరు?
హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న వస్తోంది. కానీ దానికంటే ముందు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మే 30న భైరవం మూవీ రాబోతోంది. ఎగ్జిబిటర్ల ఎఫెక్ట్ ఒకవేళ ఉంటే అన్నింటికంటే ముందు ఈ మూవీ మీదనే పడుతుంది కదా. ఇది కూడా పెద్ద బడ్జెట్ సినిమానే. దాదాపు రూ.55 కోట్లతో నిర్మించారు. మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్.. ఈ ముగ్గురూ పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే. మరి వాళ్ల సినిమా గురించి చర్చ జరగట్లేదు. ఇక దీని తర్వాత కమల్ హాసన్ నటించిన మణిరత్నం మూవీ థగ్ లైఫ్ రాబోతోంది. అది ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ కు ఉన్న ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే. మరి ఆ మూవీపై కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది కదా. కానీ ఈ మూవీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. వీరమల్లు వచ్చిన వారానికే అంటే జూన్ 20న కుబేర సినిమా వస్తోంది. అందులో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా. థియేటర్లు మూసేస్తే ఆ మూవీని ఎక్కడ ప్రదర్శిస్తారు. కానీ కుబేర గురించి కూడా కనీసం ఒక్క మాట మాట్లాడట్లేదు. కన్నప్ప జూన్ 27న వస్తుంది. థియేటర్లు మూసేస్తే ఈ సినిమాలు అన్నీ వాయిదాలు వేసుకోవాల్సిందే తప్ప వేరే అవకాశమే లేదు కదా.
కానీ అందరికీ ఒకటే నమ్మకం. ఎగ్జిబిటర్ల సమస్యలు నిర్మాతలు పరిష్కరించి థియేటర్లు మూసివేయకుండా చూస్తారేమో అని. అందుకే భైరవం, థగ్ లైఫ్ మూవీ టీమ్స్ ఇంత ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేస్తున్నాయి. ఒకవేళ ఎగ్జిబిటర్లు ఒప్పుకోకపోతే అందరికంటే ఎక్కువ నష్టపోయేది ఈ రెండు సినిమాలే. ఎందుకంటే ప్రమోషన్లకే కోట్లు ఖర్చు పెట్టేశారు ఈ మూవీ నిర్మాతలు. హరిహర వీరమల్లు మూవీ ప్రమోషన్లు ఇంకా మొదలు కాలేదు. ఎగ్జిబిటర్ల డెడ్ లైన్ తర్వాతనే మూవీ ప్రమోషన్లు చేసే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి వీరమల్లు మీదనే కుట్ర జరుగుతోంది అనడంలో అర్థమే లేదంటున్నారు నెటిజన్లు. ఒకవేళ మూవీ రిలీజ్ డేట్ వరకు థియేటర్ల మూసివేత కొనసాగితే.. వాయిదా వేసుకుని ఆ తర్వాత అయినా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు. దానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతారు. రేపు నిర్మాతల మండలి సమావేశం కాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్ల విషయాన్ని తేల్చేయడానికే రెడీ అయ్యారు. టీ కప్పులో తుఫాన్ లాంటి ఈ విషయాన్ని పెద్దది చేయాల్సిన అవసరం లేదంటున్నారు సినిమా మేథావులు.
Read Also : Manoj : ‘కన్నప్ప’ టీమ్.. నన్ను క్షమించండి.. మనోజ్ ఎమోషనల్ కామెంట్స్..