Big Breaking: లోక నాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యం గురించి గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. ఆయన జ్వరం మరియు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆయనను పోరూరు రామచంద్రన్ హాస్పిటల్ కు తరలించిన విషయం కూడా తెల్సిందే. కాగా కమల్ ఆరోగ్యం ఎలా ఉందో అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యారని చెప్తుండగా.. మరికొంతమంది ఆయన ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు.
Read Also: RC15: ఒక్క షెడ్యూల్ కోసం చరణ్ ఎన్ని లుక్స్ ట్రై చేస్తున్నాడు
ఇక ఈ నేపథ్యంలోనే వైద్యులు కమల్ హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు. “జ్వరం, శ్వాస తీసుకోవడంలో కమల్ ఇబ్బంది పడుతున్నారు. చికిత్స అందిస్తున్నాం.. ఒకటి రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తాం” అని ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు భయపడవద్దు అని వైద్యులు తెలిపారు. ఇక కమల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.
Read Also:Kamal Haasan: కమల్ ఆరోగ్యంపై పుకార్లు.. బుద్దుందా అంటూ మండిపడుతున్న నెటిజన్స్